మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ల్‌లో సోమవారం అట్టహాసంగా 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఐతే పలువురు ప్రవాసులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో పాల్గొన లేకపోయారు. స్థలం కొరత కారణంగా పలువురు ప్రవాసులను సదస్సులోకి ప్రవేశించనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. పైగా వారిని బయట స్క్రీన్‌లోనే ఆ కార్యక్రమాన్ని వీక్షించమన్నారు. దీంతో చాలా మంది ప్రవాసులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ హజరుకాలేకపోయిన పలువురు ప్రవాసులకు క్షమాపణలు చెప్పారు. విమ్మల్ని ఆహ్వానించడం కోసం ఇండోర్ సహృదయంతో సదా తలుపులు తెరిచే ఉంచింది. కానీ స్థలం కొరత కారణంగా అందర్నీ లోనికి రానివ్వలేకపోయాం అని చెప్పారు. తొక్కిసలాట జరుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు అలా చేసినట్లు వివరణ ఇచ్చారు చౌహన్. వాస్తవానికి ఈ సదస్సు కోసం దాదాపు 70 దేశాల నుంచి సుమారు మూడు వేల మంది ప్రతినిధులను ఆహ్వనించారు. ఐతే వారిలో కొందర్నే సదస్సులోకి అనుమతించారు మిగతా వారిని గేటు వద్దే అడ్డుకుని స్కీన్‌లో చూడమని చెప్పారు పోలీసులు. దీంతో చాలా మంది ప్రవాస ప్రతినిధులు షాక్‌కి గురయ్యారు.
కానీ మధ్యప్రదేశ్ సీఎం చౌహన్ క్షమాపణలు చెప్పినప్పటికీ..పలువురు ప్రవాసులు సోషల్ మీడియా వేదిక తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు ఒక ప్రవాసుడు తాను రిజస్టర్డ్ డెలిగేట్‌నని కాలిఫోర్నియా నుంచి వచ్చానని చెప్పారు. చక్కగా ఆహ్వానించి స్కీన్‌లో చూడమంటే చాలా అవమానంగా ఉంటుందని వాపోయారు. మరో ప్రవాసుడు దేవేశ్ తాను నైజీరియా నుంచి ఈ కార్యక్రమం కోసం వచ్చానని, అంత డబ్బు ఖర్చుపెట్టి వస్తే ఇంతలా అమానిస్తారా అని మండిపడ్డాడు. ఇలా పలువురు ప్రవాసులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ... సామాజిక మాధ్యమాల్లో తమ ఆగ్రహన్ని వెళ్లగక్కారు.
(చదవండి: మీరంతా భారత్ అంబాసిడర్లు: మోదీ)
Comments
Please login to add a commentAdd a comment