appologise
-
సహృదయంతో ఆహ్వానించాం! కానీ..సారీ అంటూ సీఎం క్షమాపణలు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ల్లో సోమవారం అట్టహాసంగా 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఐతే పలువురు ప్రవాసులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో పాల్గొన లేకపోయారు. స్థలం కొరత కారణంగా పలువురు ప్రవాసులను సదస్సులోకి ప్రవేశించనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. పైగా వారిని బయట స్క్రీన్లోనే ఆ కార్యక్రమాన్ని వీక్షించమన్నారు. దీంతో చాలా మంది ప్రవాసులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ హజరుకాలేకపోయిన పలువురు ప్రవాసులకు క్షమాపణలు చెప్పారు. విమ్మల్ని ఆహ్వానించడం కోసం ఇండోర్ సహృదయంతో సదా తలుపులు తెరిచే ఉంచింది. కానీ స్థలం కొరత కారణంగా అందర్నీ లోనికి రానివ్వలేకపోయాం అని చెప్పారు. తొక్కిసలాట జరుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు అలా చేసినట్లు వివరణ ఇచ్చారు చౌహన్. వాస్తవానికి ఈ సదస్సు కోసం దాదాపు 70 దేశాల నుంచి సుమారు మూడు వేల మంది ప్రతినిధులను ఆహ్వనించారు. ఐతే వారిలో కొందర్నే సదస్సులోకి అనుమతించారు మిగతా వారిని గేటు వద్దే అడ్డుకుని స్కీన్లో చూడమని చెప్పారు పోలీసులు. దీంతో చాలా మంది ప్రవాస ప్రతినిధులు షాక్‌కి గురయ్యారు. కానీ మధ్యప్రదేశ్ సీఎం చౌహన్ క్షమాపణలు చెప్పినప్పటికీ..పలువురు ప్రవాసులు సోషల్ మీడియా వేదిక తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు ఒక ప్రవాసుడు తాను రిజస్టర్డ్ డెలిగేట్నని కాలిఫోర్నియా నుంచి వచ్చానని చెప్పారు. చక్కగా ఆహ్వానించి స్కీన్లో చూడమంటే చాలా అవమానంగా ఉంటుందని వాపోయారు. మరో ప్రవాసుడు దేవేశ్ తాను నైజీరియా నుంచి ఈ కార్యక్రమం కోసం వచ్చానని, అంత డబ్బు ఖర్చుపెట్టి వస్తే ఇంతలా అమానిస్తారా అని మండిపడ్డాడు. ఇలా పలువురు ప్రవాసులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ... సామాజిక మాధ్యమాల్లో తమ ఆగ్రహన్ని వెళ్లగక్కారు. (చదవండి: మీరంతా భారత్ అంబాసిడర్లు: మోదీ) -
ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ
తీవ్ర కలకలం రేపిన తోటీ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటనపై ఎయిర్ ఇండియా సీఈఓ స్పందించారు. సీఈవో క్యాప్‌బెల్ విల్సన్ శనివారం ఆ ఘటన పట్ల క్షమాపణలు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి నలుగురు క్యాబిన్ సిబ్బంది, పైలెట్‌ని తొలగించినట్లు తెలిపారు. అలాగే విమానంలో మద్యం అందించే విషయంలో ఎయిర్‌లైన్ విధానాన్ని కూడా సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటన వేదన కలిగించిందన్నారు. ఎయిర్ ఇండియా గాల్లో ఉన్నప్పుడూ భూమ్మీ మీద సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహిస్తుందని, ఇలాంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకోవడానికే కట్టుబడి ఉందని అన్నారు. ఆయన ఈ విషయంలో సెటిల్మెంట్తో సంబంధం లేకుండా అన్ని సంఘటనలను కూలంకషంగా వివరించాలని సదరు విమాన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాధ్యతయుతమైన ఎయిర్‌లైన్ బ్రాండ్‌గా ఎయిర్ ఇండియా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా మెరుగుపరిచే కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. అంతేగాక విమానంలో ఆల్కహాల్ సర్వీస్ పాలసీని కూడా సమీక్షిస్తున్నట్లు పరోక్షంగా వివరించారు. ఇలాంటి సంఘటనలు మాన్యువల్‌గా ఉన్న పేపర్ ఆధారిత రిపోర్టింగ్‌ని మరింత మెరుగుపరిచేలా సంఘటనను కళ్లకు కట్టినట్లు చూపించే సాఫ్ట్వేర్ కోరుసన్ లైసన్స్ పొందడం కోసం మార్కెట్ లీడింగ్ ప్రోవైడర్‌లో సంతకం చేసినట్లు తెలిపారు. ఈ అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తోపాటు పైలట్లు, సీనియర్ సిబ్బంది క్యాబిన్లకు ఐప్యాడ్లను కూడా అమర్చనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇలాంటి ఘటనలను ఎలక్ట్రానిక్ పరికరాలతో రికార్డు చేయడమే గాక సంబంధింత అధికారులకు వేగవంతంగా సమాచారాన్ని నివేదించగలుగుతారని చెప్పారు. అందువల్ల ఎయిర్ ఇండియా కూడా బాధిత ప్రయాణికులకు తక్షణమే సాయం అందించడమే కాకుండా వారిని రక్షించగలుగుతుందన్నారు. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎయిర్ ఇండియా, దాని సిబ్బంది నియంత్రణాధికారులకు, చట్టాన్ని అమలు చేసే అధికారులకు సహకరించడమే గాక బాధిత ప్రయాణికులకు పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. అలాగే ఎయిర్ ఇండియా, కస్టమర్లకు, విమాన సిబ్బందికి సురక్షిత వాతావరణాన్ని అందించేందుకు కట్టుబడి ఉందని ఎయిర్ ఇండియా సీఈవోవిల్సన్ చెప్పుకొచ్చారు. -
మహారాష్ట్ర ప్రజలకు గవర్నర్ కోశ్యారీ క్షమాపణలు
ముంబై: మహారాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమం వేదికగా గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా ఉండదని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు గవర్నర్. ఈ మేరకు మరాఠీలో క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. జులై 29న అందేరీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్బంగా.. ‘మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా ముంబై, థానేల నుంచి గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే.. ఇక్కడ డబ్బులే ఉండవు. దేశానికి ఆర్థిక రాజధానిగా ముంబై కొనసాగదు.’అంటూ పేర్కొన్నారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. ఆయనపై శివసేన, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కష్టపడి పనిచేసే మరాఠీలను అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. మరోవైపు.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సైతం తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలు గవర్నర్ వ్యక్తిగతమని, దానిని తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. मा. राज्यपालांचे निवेदन pic.twitter.com/3pKWHYgPp8 — Governor of Maharashtra (@maha_governor) August 1, 2022 ఇదీ చదవండి: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామాకు డిమాండ్! -
ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరుగుతోందంటూ ప్రశ్నించడంతో సీఎం కేజ్రీవాల్ తేరుకుని క్షమించాలి అని తెలిపారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశాన్ని ఆమ్ఆద్మీ పార్టీ లైవ్ టెలికాస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మోదీ కేజ్రీవాల్ మాట్లాడుతున్న సమయంలో ‘ఏం జరుగుతోంది?’ అని ప్రశ్నించారు. ‘ఇది మన సంప్రదాయానికి విరుద్ధం కదా’ అని తెలపడంతో కేజ్రీవాల్ స్పందించి వెంటనే క్షమాపణలు చెప్పారు. ఈ సమావేశం గురించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సీఎం అరవింద్ తెలిపారు. ఇకపై జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. అయితే ఈ వివాదంపై ఆమ్ఆద్మీ పార్టీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ వివరణ ఇచ్చారు. ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని ఎలాంటి ఆదేశాలు లేవని, గతంలో చాలా సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు గుర్తుచేశారు. ప్రజలకు ప్రాధాన్యమైన అంశం కావడంతో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు సీఎంఓ తెలిపింది. ప్రత్యక్ష ప్రసారంతో ఎవరికైనా ఇబ్బందికలిగితే తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఢిల్లీ సీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ సమావేశ ప్రసారం ప్రొటోకాల్ ఉల్లంఘనగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
దక్షిణ కొరియాకు సారీ చెప్పిన కిమ్
సియోల్: ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలను చల్లబరిచే అరుదైన పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా అధికారి ఒకరు సరిహద్దు సముద్ర జలాల్లో దారుణ హత్యకు గురైన ఘటనపై ఉత్తర కొరియా అధ్యక్షుడు క్షమాపణలు చెప్పారు. అధికారి మృతిపై ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ శుక్రవారం క్షమాపణ కోరారని, ఈ అనుకోని దురదృష్టకర సంఘటనకు ఆయన ఎంతో విచారం వ్యక్తం చేశారని ద.కొరియా అధికారులు ప్రకటించారు. (ఏడాదికి 100 కోట్ల టీకా డోసులు: చైనా) ఇలా ఉ.కొరియా అధ్యక్షుడు క్షమాపణ చెప్పడం అత్యంత అరుదైన పరిణామమని విశ్లేషకులు అంటున్నారు. ఉ.కొరియా పట్ల ద.కొరియాలో పెరుగుతున్న వ్యతిరేకతను చల్లబరిచేందుకు, ఈ ఘటనపై ద.కొరియా అధ్యక్షుడిపై పెరుగుతున్న విమర్శలు తగ్గించేందుకు కిమ్ క్షమాపణ కోరి ఉంటారని విశ్లేషిస్తున్నారు. -
దక్షిణ కొరియా అధికారిపై కాల్పులు : కిమ్ క్షమాపణ
సియోల్ : సముద్రతీరంలో దక్షిణ కొరియా పౌరుడిని కాల్చిచంపడం పట్ల ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ శుక్రవారం క్షమాపణ కోరారు. ఇది ఊహించని విషాద ఘటనని సియోల్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. దక్షిణ కొరియా ఫిషరీస్ అధికారిని మంగళవారం ఉత్తర కొరియా సైనికులు కాల్చిచంపారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ పట్ల జాగ్రత్తల కారణంగా అధికారి మృతదేహం ఇంకా సముద్ర జలాల్లోనే ఉందని ఉత్తర కొరియా పేర్కొంది. కొరియా దళాలు దక్షిణ కొరియా పౌరుడిని చంపడం దశాబ్ధ కాలం తర్వాత ఇదే తొలి ఘటన కావడంతో దక్షిణ కొరియాలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కరోనా వైరస్‌తో దక్షిణ కొరియా సమస్యల్లో కూరుకుపోయిన క్రమంలో సాయం చేయాల్సిన తరుణంలో అధ్యక్షుడు మూన్, దక్షిణ కొరియన్లను నిరాశపరిచినందుకు కిమ్ క్షమాపణలు చెప్పారని దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు సు హున్ పేర్కొన్నారు. చదవండి : కిమ్ చాలా తెలివైన వాడు -
క్షమాపణ కోరిన ఆర్బీఐ గవర్నర్
పుణే: భారతదేశం యొక్క వృద్ధి రేటు 'ఒంటి కన్ను రాజు' తో పోల్చిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో ఆర్బీఐ గవర్నర్ రఘు రామ్ రాజన్ క్షమాపణలు చెప్పారు. తన మాటలు ఎవరినైనా బాధపెట్టి వుంటే క్షమించాలని ఆయన కోరారు. తాను అలాంటి పోలిక చేసి ఉండాల్సింది కాదని అన్నారు. ఈ విషయంలో ప్రజల మనోభావాలను, ముఖ్యంగా అంధులను గాయపర్చినందుకు మన్నించాల్సిందిగా కోరారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ సంక్షోభంలా ఉండగా మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి చెప్పేందుకు అలా మాట్లాడాననని రాజన్ తెలిపారు. తన వ్యాఖ్యలతో జనాభాలోని ఒక వర్గం(అంధులు) వారిని గాయపర్చినందుకు క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్ , సహాయమంత్రి జయంత్ సిన్హా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన అలాంటి పదాలు వాడడం విచారకరమని నిర్మల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ షైనింగ్ స్టార్ లా ఉందంటూ రాజన్ వ్యాఖ్యలను జయంత్ సిన్హా తప్పుబట్టారు. -
'ఇప్పుడేమంటారు.. సోనియా క్షమాపణ చెప్పి తీరాలి'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికైనా తమకు క్షమాపణ చెప్పితీరాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇష్ర్రాత్ జహాన్ కూడా ఓ ఉగ్రవాదేనని లష్కరే ఈ తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పిన నేపథ్యంలో గతంలో తమపై అనవసరంగా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందనన్నారు. 'ఉగ్రవాది ఇష్రాత్ జహాన్‌ను హతమార్చిన నాటి పోలీసు హీరోలకు, దేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి' అని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ అన్నారు. 2014లో జూన్ 15న గుజరాత్ లోని అహ్మదాబాద్ శివారుల్లో పోలీసులకు కొందరు అనుమానితులపై జరిపిన కాల్పుల్లో ఇష్రత్ జహాన్ ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టిన ఇలాంటి సంఘటనపట్ల హర్షం వ్యక్తం చేయకుండా నాటి పోలీసులను అభినందించకుడా అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రశ్నలు లేవనెత్తిందని, కొందరిని జైలులో పెట్టిందని శ్రీకాంత్ శర్మ మండిపడ్డారు.