Pravasi Bharatiya Divas
-
బౌద్ధ సంస్కృతితోనే వికాసం, ప్రకాశం
వేల ఏళ్ల క్రితమే భారతదేశం శాంతి సౌభాగ్యాలను ప్రవచించిన బుద్ధభూమిగా విదేశాల వారికి తెలుసు. ప్రపంచమంతా కత్తులతో సామ్రాజ్య విస్తర ణలో తలమునకలైన వేళ అశోక చక్రవర్తి శాంతిమార్గాన్ని ఎన్నుకున్నాడు. అదీ భారత వారసత్వ బలం. ప్రజాస్వామ్యం మన జీవితాల్లో అంతర్భాగం. అది మన జీవనశైలి. బౌద్ధ సూత్రాలు అనేకం మన రాజ్యాంగంలోనూ పొందుపరచారు అంబేడ్కర్. అయితే ఈనాడు తద్ద్విరుద్ధమైన పరిస్థితులుదేశంలో నెలకొని ఉన్నాయి. దళితులపై, స్త్రీలపై, మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. దేశంలో అంతర్గత సామాజిక వ్యవస్థ సంక్షో భంలో ఉంది. ప్రజల ఆహార, ఆహార్య అంశాల పట్ల కూడా వివక్ష, హింసలు కొనసాగుతున్నాయి. అందుకే బౌద్ధ పునరుజ్జీవన ఉద్యమం అవసరం.ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భువనేశ్వర్‌లో 18వ ప్రవాస భారతీయ దివస్ (పీబీడీ) సదస్సులో ప్రసంగిస్తూ ‘మానవుని భవిష్యత్తు యుద్ధంలో కాకుండా బుద్ధునిలో ఉందని’ ఉద్ఘాటించారు. ఇది చాలా చరిత్రాత్మకమైన ప్రకటన. అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న ప్రకటన అని చెప్పక తప్పదు.రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వారి గురించి, అలాగే ఇజ్రాయెల్– గాజా మధ్య జరుగుతున్న మానవ హననం గురించిన ఆందోళన ఇందులో లీనమై ఉంది. ఇంకా ఆయన ఈ సందర్భంగా మన దేశానికి ఉన్న సమున్నత సాంస్కృతిక వార సత్వం కారణంగా మన తత్త్వాన్ని అంతర్జాతీయ సమాజానికి చెప్పగలుగుతున్నామనీ, ప్రస్తుతం ప్రపంచం మనం చెప్పే మాటను వింటోందని తెలిపారు. ఆయన మరొక ముఖ్యమైన ప్రస్తావన కూడా చేశారు. ‘ప్రపంచ మంతా కత్తులతో సామ్రాజ్య విస్తరణలో తలమునకలైన వేళ అశోక చక్రవర్తి శాంతిమార్గాన్ని ఎన్నుకున్నారు. అదీ భారత వారసత్వబలం. భారత్ అంటే ప్రజాస్వామ్యానికి తల్లి. ప్రజాస్వామ్యం మన జీవితాల్లో అంతర్భాగం. అది మన జీవనశైలి. భిన్నత్వం గురించి మనకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితాలు దానిపైనే నడుస్తున్నాయి. భారతీయులు ఏ దేశానికి వెళ్లినా ఆ సమాజంలోఅంతర్భాగం అవుతారు. ఆ యా దేశాల సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ చిత్తశుద్ధితో పనిచేసి అక్కడి పురోభివద్ధికి దోహదపడు తుంటారు. అదే సమయంలో వారి హృదయాలు భారత్ కోసం తపిస్తుంటాయి. ప్రవాసులను మన దేశ రాయబారులుగా నేను చూస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకుని తిరుగుతున్నానంటే దానికి వారే కారణం. అన్ని చోట్లా వారు నాకు ఘనస్వాగతం చెబు తుంటారు. భారత్ నుంచి యువత పూర్తి నైపుణ్యాలతో విదేశాలకు వెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని అన్నారు. వాస్తవానికి భారతదేశం అశోకుడు కత్తి దించాక ప్రపంచంఅంతా విస్తరించింది. కేవలం సామాజిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, తాత్విక సాంస్కృతిక విప్లవం కూడా భారత్ నుండి ప్రపంచానికి విస్తరించింది. భారతదేశం ఉత్పత్తి క్రమం పెరగాలంటే తప్పక బౌద్ధం విస్తృతి ప్రపంచ దేశాలకే కాదు భారతదేశానికీ మరింత అవసరం అని అంబేడ్కర్ అప్పుడే చెప్పారు. ఈ క్రమంలో ప్రసిద్ధ భారతదేశ చరిత్ర పరిశోధకులు రొమిల్లా థాపర్ బౌద్ధం... మరీ ముఖ్యంగా అశోకుని బౌద్ధం స్వీయ జీవిత అనుభవం నుంచి వ్యక్తీక రించబడిందని, అనుసరించబడిందని చెప్తూ అది భారతదేశంలో నూత్న నిర్మాణానికి దారి తీయడానికి ఎన్నో సామాజిక అసమాన తలకు సంబంధించిన అమానవ ధర్మాలను త్రోసి పుచ్చిందని అన్నారు. ‘దమ్మం అనేది అశోకుని దృష్టిలో ఒక జీవిత విధానం. అది అతనికి పరిచయమున్న తత్త్వవేత్తల నైతిక బోధనల సారం. బహుశా స్వీయ జీవితానుభవ సారం కూడా అయివుండవచ్చు. ఆ జీవిత విధానం ఉన్నత స్థాయి సామాజిక నీతి మీద, పౌరబాధ్యతల మీద ఆధారపడింది. అంతేగాక అశోకుడు... వర్ణవ్యవస్థను గురించి ఆదర్శప్రాయంగా చిత్రించిన సిద్ధాంతంగా కాక, నిత్యజీవితం దృష్ట్యా తన దమ్మాన్ని రూపొందించార’ని రొమిల్లా థాపర్ విశ్లేషించారు. ‘సాధారణంగా పెక్కు సమాజాలలో కన్పించే సాంఘిక డాంబికత్వాన్ని పరిహరించి, మానవత్వ సిద్ధమైన సాంఘిక ప్రవర్తనను అశోకుడు కాంక్షించాడు. స్వర్గ సౌఖ్యం వంటి ఆధ్యాత్మిక భావనలో ప్రజలకు పరిచయముంది. అటువంటి ప్రతిఫలాల ఆశ చూపటం ద్వారా సాంఘిక బాధ్యతను కేవలం సదాచార వర్తనగా గాక, సాత్విక ప్రాధాన్యం ఉండి నిర్వా్యజంగా అనుసరించే బాధ్యతగా ఉదాత్త స్థానానికి కొనిపోవడానికి అశోకుడు ప్రయత్నించాడ’ని రొమిల్లా థాపర్ అశోకుని పరిపాలనా విధానం గురించి చెప్పారు.ఈనాడు భారతదేశంలో బౌద్ధ సాంస్కృతిక, ఆర్థిక విప్లవం అవసరం అని నరేంద్ర మోదీ సంఘ్‌పరివార్ శక్తులకు కూడా బోధించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో దళితులపై, స్త్రీలపై, మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. భారతదేశంలో అంతర్గత సామాజిక వ్యవస్థ సంక్షో భంలో వుంది. ప్రజల ఆహార, ఆహార్య అంశాల పట్ల కూడా వివక్ష, హింసలు కొనసాగుతున్నాయి. అందుకే ఈ సందర్భంగా ఆయనఅంతర్గత లౌకిక వాదానికి కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి దిగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతులు తగ్గుతున్నాయి. భారతదేశంలో సామాజిక ఆర్థిక ఉత్పత్తులు పెరగా లంటే ఈనాడు తప్పకుండా సామాజిక జీవన సామరస్యాన్ని,శాంతిని, కరుణను, కుల వివక్షేతరమైన ప్రజ్ఞను గుర్తించే కుల నిర్మూలనా భావం పాలకులకు అవసరం. బౌద్ధ సంస్కృతీ వికాసం అవసరం. అశోకుడి పాలనను పునర్వివేచించుకొని సమన్వయించు కోవడం అవసరం.బౌద్ధాన్ని ఒక మతంగా కాక ఒక ధర్మంగా, ఒక నీతిగా పరి వ్యాప్తి చేయవలసిన అవసరం వుంది. సారనాథ్‌లో అశోకుడు నిలిపిన శిలాస్తంభ అగ్రభాగంలోని నాలుగు సింహాల శిల్పాన్ని భారత ప్రభుత్వం అధికార ముద్రగా స్వీకరించింది. కానీ ఈ దేశాన్ని బౌద్ధ భూమిగా ప్రకటించలేకపోయింది. అయితే ఇప్పుడు హిందూదేశంగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతుండడం గమ నార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు యుద్ధానికి బదులు శాంతి అవ సరం అని చెబుతున్న పాలకులందరూ ఆయుధ సంపత్తికే ఎక్కువ ధనం ఖర్చు బెట్టడం విడ్డూరం. భారత ప్రధాని నరేంద్ర మోదీ అంత ర్జాతీయ వేదికలపై చెబుతున్న మాటలను భారతదేశంలో కూడా నిరంతరంగా చెప్పడమే కాక, ఆచరణలోకి తీసుకురావడం వల్లఎంతో మేలు జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో భారత రాజ్యాంగకర్త అంబేడ్కర్‌ను అవమానిస్తూ మాట్లాడటాన్ని మోదీ ఖండించలేదు. అది బాధాకరమైన విషయం. బుద్ధ–అశోకులంతటి వారు అంబేడ్కర్. భారతదేశంలో ఈనాడు రక్తపాతంలేని సమాజం ఏర్పడిందంటే ఆయనే కారణం.నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు ఆర్థిక పరిస్థితులు దిగ జారడానికి కారణం బౌద్ధ జీవన విధానం ప్రపంచంలో లేకపోవ డమే! ప్రపంచమంతా ఆశాంతిగా ఆర్థిక సంక్షోభంలో ఉండడానికి కారణం ప్రకృతినీ, మనిషి వ్యక్తిత్వాన్నీ కాపాడుకోలేక పోవడమే. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద భావనలు పెరిగి పర్యావరణవిధ్వంసం, యుద్ధకాంక్ష, దోపిడీలు పెరగడం వల్ల ప్రపంచంలోశాంతి అంతరిస్తూ ఉంది. అంబేడ్కర్ రాజ్యాంగంలో బౌద్ధ ధమ్మంలోని అష్టాంగ సూత్రాలు, పంచశీల వంటి వాటి నుండే భారత రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు. నరేంద్ర మోదీ బౌద్ధంతో పాటు ప్రపంచానికి భారత రాజ్యాంగ ప్రశస్తిని చాటవలసిన అవసరం ఉంది. బుద్ధుణ్ణి, అశోకుణ్ణి, అంబేడ్కర్‌ని భారతదేశ పునర్మిర్మాణ కర్తలుగా ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్క మోదీనే కాదు, ప్రతిపక్ష నాయకులు, ఆ యా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బౌద్ధ సంస్కృతి వికాసానికి పాటుపడాల్సిన అవసరం ఉంది. ఏపీ సీఎం చంద్ర బాబుకి అమరావతిని బౌద్ధ సాంస్కృతిక, తాత్విక, ఆర్థికకేంద్రంగా నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ చెప్ప వలసిన అవసరం ఉంది. చంద్రబాబు నోట బుద్ధుని పేరు గాని, అశో కుని పేరుగాని, అంబేడ్కర్ పేరుగాని రాకపోవడం శోచనీయం. ఈనాడు భారత రాజ్యాంగ సూత్రాల పునాదుల మీద బౌద్ధ జీవన పునరుజ్జీవనానికి ఆచరణాత్మకంగా పూనుకోవాల్సిన చారిత్రక సంద ర్భంలో మనమున్నాం. ఆ దిశగా నడుద్దాం. - వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695-డా‘‘ కత్తి పద్మారావు -
యుద్ధంలో కాదు.. బుద్ధుడిలోనే భవిష్యత్తు
భువనేశ్వర్: ఘనమైన వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని, నేడు మనం చెప్పే మాట వింటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భవిష్యత్తు అనేది యుద్ధంలో లేదు, బుద్ధుడిలో ఉందని ప్రపంచానికి చెప్పగల శక్తి భారత్‌కు ఉందని తెలిపారు. గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, మనందరి జీవితాల్లో ప్రజాస్వామ్యం ఒక అంతర్భాగమని స్పష్టంచేశారు. ప్రపంచ స్థాయిలో మన దేశ ప్రతిష్ట ఎంతగానో పెరిగిందని అన్నారు. కేవలం మన మనోగతమే కాకుండా గ్లోబల్ సౌత్ దేశాల అభిప్రాయాలను సైతం ప్రపంచ వేదికపై బలంగా వినిపించగలుగుతున్నామని వెల్లడించారు. ఆయుధ బలంతో సామ్రాజ్యాలు విస్తరిస్తున్న కాలంలో అశోక చక్రవర్తి శాంతి మార్గంలో నడిచారని గుర్తుచేశారు. మన వారసత్వ బలానికి ఇదొక ప్రతీక అని వెల్లడించారు. యుద్ధంలో కాకుండా బుద్ధుడి బోధనల్లోనే భవిష్యత్తు ఉందని భారత్ నమ్ముతున్నట్లు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... మీ వల్లే తలెత్తుకొని ఉండగలుగుతున్నా.. ‘‘ప్రవాస భారతీయులను మన దేశానికి రాయబారులుగా పరిగణిస్తున్నాం. వైవిధ్యం గురించి మనకు ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యంపై మన జీవితాలు నడుస్తున్నాయి. భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి సమాజంతో హృదయపూర్వకంగా మమేకమవుతూ ఉంటారు. ఇతర దేశాల నియమ నిబంధనలు మనం చక్కగా గౌరవిస్తాం. మనకు ఉద్యోగం, ఉపాధి కల్పించిన దేశానికి నిజాయితీగా సేవ చేయడం, ఆ దేశ ప్రగతిలో పాలుపంచుకోవడం మనకు అలవాటు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన హృదయం భారతీయతతో నిండి ఉంటుంది. భారత్ కోసమే మన గుండె చప్పుడు వినిపిస్తుంది. ప్రవాస భారతీయులు మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారు. వారి వల్లే విదేశాలకు వెళ్లినప్పుడు నేను తలెత్తుకొని ఉండగలుగుతున్నా. మనది యువ భారత్: 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రావడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నా. మనది యువ భారత్. ఇక్కడ యువ జనాభా అధికం. అంతేకాదు నైపుణ్యం కలిగిన యువత మన దగ్గర ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాల డిమాండ్‌ను తీర్చగల సత్తా ఇండియాకు ఉంది. డిజిటల్ టెక్నాలజీలో మనం ముందంజలో ఉన్నాం. ఆధునిక యుద్ధ విమానాలు, రవాణా విమానాలను మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. ‘మేడ్ ఇన్ ఇండియా’ విమానాల్లో మీరంతా ప్రవాసీ భారతీయ దివస్‌కు వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. భారతదేశ ఆసలైన చరిత్రను విదేశాల్లో చాటి చెప్పండి’’ అని ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచానికి ఆయుర్వేదం ఇచ్చిన భారత్: క్రిస్టినా క్లారా ప్రపంచ నాగరికత అభివృద్ధిలో భారత్ వెలకట్టలేని అత్యున్నత పాత్ర పోషించిందని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా ప్రశంసించారు. ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె గురువారం మాట్లాడారు. గణితం, వైద్యం, సముద్రయానం వంటి రంగాల అభివృద్ధికి భారత్ దోహదపడిందని చెప్పారు. భారత్ అందించిన ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని అన్నారు. క్రిస్టిన్ క్లారాకు భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు ప్రకటించింది. -
సహృదయంతో ఆహ్వానించాం! కానీ..సారీ అంటూ సీఎం క్షమాపణలు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ల్లో సోమవారం అట్టహాసంగా 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఐతే పలువురు ప్రవాసులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో పాల్గొన లేకపోయారు. స్థలం కొరత కారణంగా పలువురు ప్రవాసులను సదస్సులోకి ప్రవేశించనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. పైగా వారిని బయట స్క్రీన్లోనే ఆ కార్యక్రమాన్ని వీక్షించమన్నారు. దీంతో చాలా మంది ప్రవాసులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ హజరుకాలేకపోయిన పలువురు ప్రవాసులకు క్షమాపణలు చెప్పారు. విమ్మల్ని ఆహ్వానించడం కోసం ఇండోర్ సహృదయంతో సదా తలుపులు తెరిచే ఉంచింది. కానీ స్థలం కొరత కారణంగా అందర్నీ లోనికి రానివ్వలేకపోయాం అని చెప్పారు. తొక్కిసలాట జరుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు అలా చేసినట్లు వివరణ ఇచ్చారు చౌహన్. వాస్తవానికి ఈ సదస్సు కోసం దాదాపు 70 దేశాల నుంచి సుమారు మూడు వేల మంది ప్రతినిధులను ఆహ్వనించారు. ఐతే వారిలో కొందర్నే సదస్సులోకి అనుమతించారు మిగతా వారిని గేటు వద్దే అడ్డుకుని స్కీన్లో చూడమని చెప్పారు పోలీసులు. దీంతో చాలా మంది ప్రవాస ప్రతినిధులు షాక్‌కి గురయ్యారు. కానీ మధ్యప్రదేశ్ సీఎం చౌహన్ క్షమాపణలు చెప్పినప్పటికీ..పలువురు ప్రవాసులు సోషల్ మీడియా వేదిక తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు ఒక ప్రవాసుడు తాను రిజస్టర్డ్ డెలిగేట్నని కాలిఫోర్నియా నుంచి వచ్చానని చెప్పారు. చక్కగా ఆహ్వానించి స్కీన్లో చూడమంటే చాలా అవమానంగా ఉంటుందని వాపోయారు. మరో ప్రవాసుడు దేవేశ్ తాను నైజీరియా నుంచి ఈ కార్యక్రమం కోసం వచ్చానని, అంత డబ్బు ఖర్చుపెట్టి వస్తే ఇంతలా అమానిస్తారా అని మండిపడ్డాడు. ఇలా పలువురు ప్రవాసులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ... సామాజిక మాధ్యమాల్లో తమ ఆగ్రహన్ని వెళ్లగక్కారు. (చదవండి: మీరంతా భారత్ అంబాసిడర్లు: మోదీ) -
మీరంతా భారత అంబాసిడర్లు: ప్రధాని మోదీ
ఇండోర్: ప్రవాస భారతీయులను విదేశీ గడ్డపై భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రాబోయే 25 ఏళ్ల అమృతకాల ప్రయాణంలో వారి పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రత్యేక గౌరవ అతిథిగా సురినామ్ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతోఖీ, ముఖ్య అతిథిగా గయనా అధ్యక్షుడు మొహమ్మన్ ఇర్ఫాన్ అలీ హాజరయ్యారు. 66 దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే... ప్రవాసీల ఘనతలను రికార్డు చేయాలి ‘‘ఎన్నారైఐలు భారత దూతలు. మన యోగా, ఆయుర్వేదం, హస్తకళలు, చిరుధాన్యాలు, కాటేజీ పరిశ్రమకు మీరు బ్రాండ్ అంబాసిడర్లు. ప్రపంచ వేదికపై భారత్ పాత్ర మీ వల్లే బలోపేతం కానుంది. స్కిల్ క్యాపిటల్‌గా కూడా ఎదిగే సామర్థ్యం భారత్‌కుంది. ప్రపంచ ప్రగతికి ఇంజన్‌గా మారనుంది. భారత్ గురించి తెలుసుకొనేందుకు ప్రవాసీల సంతానం ఆసక్తి చూపుతుండడం శుభపరిణామం. భారతీయులు ఎన్నో దేశాలకు వలస వెళ్లి శతాబ్దాలుగా స్థిరపడ్డారు. వారి జీవితాన్ని, ఎదుర్కొన్న కష్టానష్టాలు, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను రికార్డు చేయాల్సిన అవసరముంది. ఇందుకు భారత వర్సిటీలు చొరవ తీసుకోవాలి. వారి అనుభవాలు, జ్ఞాపకాలను ఆడియో–విజువల్, అక్షరరూపం నమోదు చేయాలి. శతాబ్దాల క్రితమే అంతర్జాతీయ వాణిజ్యం జీ20 సారథ్య బాధ్యతను ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. మన గురించి ప్రపంచదేశాలకు తెలియజేయడానికి ఇది సరైన వేదిక. ప్రపంచంలో భారత్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది. మన మాటకు, సందేశానికి ఎంతో విలువ ఉంది. కరోనా టీకాలను దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నాం. 220 కోట్ల టీకా డోసులను ఉచితంగా అందించాం. మన అభివృద్ధి అసాధారణం, అద్వితీయం ప్రపంచంలోని ఐదు అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటిగా మారింది. అత్యధిక స్టార్టప్‌లు ఉన్న మూడో దేశం మనదే. నేడు ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. కొన్నేళ్లుగా మనం సాధించిన ఘనతలు అసాధారణం, అద్వితీయం. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 40 శాతం కేవలం భారత్‌లోనే జరుగుతున్నాయి. మనకు అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ ఉంది. అంతరిక్షంలోకి ఒకేసారి 100 ఉపగ్రహాలను పంపించగల సత్తా మన సొంతం. ఎన్ఆర్ఐల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. వారికి అవసరమైన సాయం కచ్చితంగా అందిస్తాం. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కాపాడాలని ఎన్ఆర్ఐలను కోరుతున్నాం. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాలని, మన దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పాలని విన్నవిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని సందర్శించాలని ఎన్ఐఆర్లకు సూచించారు. సురక్షిత, చట్టబద్ధ వలసల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని విడుదల చేశారు. దర్శన్ సింగ్‌కు ప్రవాసీ సమ్మాన్ అవార్డు విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ఇచ్చే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును అమెరికా వ్యాపారవేత్త, దాత దర్శన్ సింగ్ దలీవాల్కు ప్రదానం చేశారు. పంజాబ్‌లోని పటియాలాకు చెందిన ఆయన అమెరికాలో వ్యాపారవేత్తగా ఎదిగారు. భారత్‌తోపాటు పలు దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారత్‌లోనే చదివా: గయానా అధ్యక్షుడు భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ పేర్కొన్నారు. ‘‘నేను భారత్‌లో చదువుకున్నా. భారతీయుల ప్రేమాభిమానాలు నాకు తెలుసు’’ అన్నారు. భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని సురినామ్ అధ్యక్షుడు సంతోఖీ హర్షం వ్యక్తం చేశారు. -
Pravasi Bharatiya Divas: విదేశాల్లో ఉన్నా స్వదేశంలో సేవ
జీవితంలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో విదేశాలకు వెళ్లినవారు తమను తాము నిరూపించుకునే దిశగా సాగుతారు. కలల లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమించడంతో పాటు తమ చుట్టూ ఉన్నవారికి చేయూతనివ్వాలనుకుంటారు. తమ మూలాలను గుర్తుపెట్టుకొని సొంత గడ్డ అభ్యున్నతికి పాటుపడాలని తపిస్తుంటారు. వారి ఆలోచనలతో మరికొందరి అడుగులకు స్ఫూర్తిగా నిలుస్తారు. విదేశాల్లో తాము ఎంచుకున్న రంగాల్లో కృషి చేస్తూనే సేవా కార్యక్రమాల ద్వారా స్వదేశంలో ఉన్నవారికి చేయూతనందిస్తున్నారు విజయవాడ వాసి అయేషా, ఖమ్మం జిల్లా వాసి ఝాన్సీ. పిల్లలకు కష్టం విలువ తెలియాలని.. విజయవాడ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు ఆయేషా. ఉద్యోగం, కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉన్న ఆమె సేవాకార్యక్రమాలవైపు మళ్లిన ఆలోచనావిధానం గురించి తెలిపారు. ‘మా కుటుంబంతో కాలిపోర్నియాలో స్థిరపడ్డాను. నేను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఇటీవల నాన్‌ప్రాఫిట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కూడా అందుకున్నాను. ఉద్యోగినిగా ఉన్న నేను మొదట ఒక తల్లిగా మా పిల్లలకు సేవా ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను. అదే సమయంలో మా చుట్టుప్రక్కల ఉండే పిల్లల పరిస్థితి గమనించాను. పిల్లల్లో మానవతా విలువలు పెంచాలని కమ్యూనిటీ సర్వీస్ చేయాలనే సదుద్దేశంతో ఏడేళ్ల క్రితం ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థని ప్రారంభించాను. ఇప్పుడు వందలాది మందికి పైగా వలెంటీర్లు మా ఆర్గనైజేషన్‌లో సేవలందిస్తున్నారు. మా అమ్మనాన్నలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. వారిని చూడటం కోసం మొదట మా పిల్లలను తీసుకొని ఇండియాకు వచ్చేదాన్ని. మారుమూల గ్రామాల్లోని పాఠశాల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, ఆ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వచ్ఛందంగా పనిచేసే మిత్రులు కొందరు పరిచయమయ్యారు. వారితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటూ అమెరికాలో మేమున్న ప్రాంతంలో సేకరించిన పుస్తకాలను ఆంధ్రాలోని గ్రామాల స్కూళ్లకు అందజేసేవాళ్లం. ఈ కార్యక్రమం ప్రతియేటా నిర్వహించేవాళ్లం. నాతోపాటు ప్రతి యేటా వలెంటీర్లుగా వర్క్ చేసే పిల్లలు కనీసం పదిమందినైనా ఇండియాకు తీసుకువచ్చేదాన్ని. వారితో ఇక్కడి స్కూల్ పిల్లలకు వర్క్‌షాప్స్ కండక్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత సమస్యలు తెలుస్తున్న కొద్దీ వాటి మీద దృష్టి పెడుతూ వచ్చాను. అందరం ఉపాధి కోసం విదేశాలకు వచ్చినవాళ్లమే. కాని మా మూలాలను ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పరిస్థితులలోనే స్వదేశంలోని పిల్లలకు సర్వీస్ చేయాలనుకున్నాను. ట్రైబల్ ఏరియాలోని పిల్లలకు మా సేవలు అందేలా కృషి చేస్తుంటాను. స్వచ్ఛంద సంస్థల ద్వారా మా సేవకార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. నిరుపేదలకు ఏదైనా సాయం కావాలని మా దృష్టికి వస్తే ఇక్కడ ఫండ్ రైజింగ్ కి వెబ్సైట్ లో ప్రకటిస్తాం. ఇప్పటి వరకు మనవాళ్లు ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు’’ అని తెలిపారు ఆయేషా. మహిళల శ్రేయస్సు కోసం.. ఖమ్మం జిల్లా వాసి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేశారు. మహిళలు, బాలికల సంక్షేమం కోసం అక్కడే ‘వెటా’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, వివిధ కార్యక్రమాల ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే, పుట్టి పెరిగిన గడ్డకు మేలు చేయాలనే ఆలోచనతో స్వదేశంలోనూ సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ‘‘లక్ష్యం పెద్దదిగా ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దానిని సాధించే దిశగానే మన అడుగులు ఉండాలి. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అమెరికా వెళ్లి, అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. పిల్లలు పుట్టాక వారిని చూసుకునే క్రమంలో ఉద్యోగాన్ని మానేసి, రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను. ఒక మహిళ ఏం చేస్తుంది ఈ రంగంలో అనుకునేవారికి నా విజయం ద్వారానే సమాధానం చెప్పాను. అమెరికాలోని మన భారతీయ మహిళల సమస్యల గురించి అర్థం చేసుకున్నాను. సొంతంగా ఎదగాలనుకునేవారు, ఉద్యోగాలు చేయాలనుకునేవారు, గృహహింస వంటి బాధలు పడేవారు .. అన్ని రకాలుగా జీవితంతో పోరాటం చేసేవారున్నారు. అలాంటివారి శ్రేయస్సు కోసం పనిచేయాలని ‘వెటా’ను స్థాపించాను. మన విజయాలను మన అనుకున్న నలుగురికి కూడా పంచాలి. మా సొంత ఊళ్లకు వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులను గమనించి అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వచ్చాం. మా ఊరు బనిగండ్లపాడు గ్రామంలోనే కాదు, మా వారు పుట్టి పెరిగిన వరంగల్ జిల్లా తొర్రూరులోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గ్రంథాలయాలను ఏర్పాటు చేశాం. స్కూల్ భవనాలను కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాం. తొర్రూరులో హాస్పిటల్ కట్టించాం. గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాం. మా చుట్టుçపక్కల మరో ఆరుగ్రామాల వరకు మా సేవలు అందిస్తుంటాం. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది మా ఆలోచన. అందుకే, పేద విద్యార్థులకు ప్రతియేటా ఆర్థిక సాయం చేస్తుంటాం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మాకు చేతనైంత సాయం అందించాలన్నదే మా సిద్ధాంతం. ముందుగా మనకు మనంగా ఎదగాలి. అందుకోసం ఎంతటి కష్టమైనా పడాలి. అలాగే, నలుగురి మేలు కోసం పాటుపడినప్పుడే మన జీవితానికి సంతృప్తి లభిస్తుంది’’ అని వివరించారు ఝాన్సీరెడ్డి. -
Pravasi Bharatiya Divas: రవి అస్తమించని ప్రవాస భారతీయం
ప్రపంచ నలుమూలలా భారతీయులు నివసిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 210 దేశాలలో భారతీయ మూలాలున్న వారు, ఎన్నారైలు కలిపి 3.2 కోట్లకు పైగానే ఉన్నారు. ప్రవాస భారతీయ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన దేశాలు 150 పైనే ఉన్నాయి. నేడు అనేక దేశాల్లో రాజకీయంగా కూడా భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని కమలా హారిస్ అలంకరించిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లో జన్మించిన తెలుగింటి బిడ్డ అరుణ మిల్లర్ (కాట్రగడ్డ అరుణ) మేరీలాండ్ రాష్ట్రానికి గత నవంబర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వివిధ దేశాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు వివిధ దేశాలకు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. రిషి సునాక్ (బ్రిటన్ ప్రధాని), అంటో నియ కోస్టా (పోర్చుగల్ ప్రధాని), మహ్మద్ ఇర్ఫాన్ అలీ (గయానా ప్రెసిడెంట్), పృథ్వీరాజ్ రూపన్ (మారిషస్ అధ్యక్షులు), చంద్రిక పెర్సద్ శాన్ టోఖి (సురినామ్ ప్రెసిడెంట్) లతోపాటు 200 మందికి పైగా భారతీయులు 15 దేశాల్లో వివిధ హోదాల్లో ప్రజాసేవలో ఉన్నారు. వీరంతా అమెరికా, యూకే, కెనడా, గయానా, సురినామ్, ఫిజీ, ట్రినిడాడ్ అండ్ టుబాగో, సింగపూర్, మారిషస్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మలేసియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పనిచేస్తున్నారు. వీరు కాకుండా వివిధ దేశాల్లో, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రెసిడెంట్‌గా ఉన్నఎస్.ఆర్.నాథన్ (1999–2011), దేవన్ నాయర్ (1981 –1985)లు, ఫిజీ ప్రధానిగా పనిచేసిన మహేంద్ర చౌదరి, మలేసియా ప్రధానిగా పని చేసిన మహతీర్ బిన్ మహ్మద్ వంటి వారు భారతీయ మూలాలున్నవారే. ప్రపంచంలోని అగ్రస్థానాల్లో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, ఈ మధ్య వరకు ట్విట్టర్ సీఈఓగా కొనసాగిన పరాగ్ అగర్వాల్, పెప్సికోలా ఒకప్పటి సీఈఓ ఇంద్రనూయి వంటి వారెందరో భారతీయ మూలలున్నవారే. నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ప్రవాస భారతీయులు బ్రిటిష్ రాజ్ కాలంలో, తదనంతరం విదేశాలకు వెళ్ళినవారే. ముఖ్యంగా వ్యవసాయం పనుల కోసం వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. మారిషస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, కెనడా, దక్షిణాఫ్రికా మలేసియా, ఫిజీ వంటి కామన్వెల్త్ దేశాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నవారు వీరే! స్వాతంత్య్రానంతరం ప్రపంచ కలల దేశమైన అమెరికాకు భారతీయ వలసలు ప్రారంభమై, నేడు సుమారు 45 లక్షల మంది ఆ గడ్డపై తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. 10 దేశాల్లో భారతీయుల జనాభా 10 లక్షలు దాటితే మరో 22 దేశాల్లో లక్షకు పైగా వున్నారు. డర్బన్ నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారంటే ఆ నగరంలో భారతీయుల హవాని అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఏడు 25 లక్షల భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు. భారతీయ వలసల్లో ఇదే పంథా కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భారతీయ పరిమళాలు ధరణి అంతా మరింత వ్యాపించి రవి అస్తమించని ‘భారతీయం’ సాక్షాత్కరిస్తుంది. (క్లిక్ చేయండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..! - కోరాడ శ్రీనివాసరావు ప్రభుత్వాధికారి, ఏపీ (జనవరి 8–10 ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల సందర్భంగా) -
గదర్ గర్జన
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్నాడు కవి. కానీ ఆ తల్లి బానిస సంకెళ్ల చెరలో ఉంటే ఏ దేశమేగినా, ఎందుకాలిడినా బిడ్డలు సంతోషంగా ఉండలేరు. బ్రిటిష్ పాలనలో మగ్గుతున్న తల్లి భారతి దుస్థితికి స్వదేశంలోని భారతీయులతో పాటు విదేశాల్లో ఉండే భారతీయులు కూడా తీవ్రవేదన అనుభవించారు. మాతృమూర్తి దాస్యం చూసీ చూసీ ప్రవాస భారతీయుల కన్నీరు ఎరుపెక్కింది! ఎలాగైనా బ్రిటిష్ చెర నుంచి జన్మభూమికి విముక్తి కల్పించాలని ఆ ఎర్రటి కన్నీటి సాక్షిగా ప్రవాస భారతీయులు చేసుకున్న ప్రతిజ్ఞ నుంచి ఆవిర్భవించింది గదర్ పార్టీ! పార్టీకి ముందే పత్రిక ‘గదర్’ అనే పేరు వెనుక చాలా నేపథ్యం ఉంది. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటాన్ని బ్రిటిషు వారు ‘గదర్’ అని పిలిచేవారు. గదర్ అంటే పంజాబీ, ఉర్దూ భాషలలో తిరుగుబాటు అని అర్థం! ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తిని, పోరాటాన్ని కొనసాగించి, అంతిమంగా దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయాలన్న లక్ష్యంతో ‘హిందుస్థాన్ గదర్’ అనే పత్రికను ప్రవాస భారతీయులు ఆరంభించారు. ఈ పత్రిక ఆధారంగా పలువురు వీరులు దగ్గరై గదర్ సంఘంగా మారారు. ఇదే అనంతర కాలంలో గదర్ పార్టీగా రూపొందింది. ఈ పార్టీ హిందూ, సిక్కు, ముస్లిం నాయకుల సమ్మేళనం. 1913లో బ్రిటిష్ పాలనతో సంబంధం లేకుండా విదేశాల నుంచి స్వదేశంలోని స్వాతంత్య్ర విప్లవోద్యమానికి సహాయం చేయాలన్న సంకల్పంతో పార్టీ అవతరించింది. ఆరంభంలో ఈ పార్టీలో అత్యధికులు అమెరికా, కెనెడాల్లోని ప్రవాస భారతీయులు కాగా తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లోని ప్రవాస భారతీయులు ఇందులో చేరారు. హిందూస్థాన్ గదర్ పత్రిక కార్యాలయం ఉన్న కాలిఫోర్నియాలోని శాన్ ప్రాన్సిస్కోలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. జాతీయవాద చైతన్యం 1903–1913 కాలంలో దాదాపు పదివేలకు పైగా భారతీయులు ఉత్తర అమెరికాలో పలు ఉద్యోగాలకు వలసవెళ్లారు. వీరిలో సగంమంది బ్రిటిష్ మిలటరీలో చేరారు. నానాటికీ పెరుగుతున్న భారతీయుల, ముఖ్యంగా పంజాబీల ప్రాధాన్యం తగ్గించేందుకు కెనడా ప్రభుత్వం పలు చట్టాలు తీసుకువచ్చింది. దీంతో కెనడాకు వెళ్లడం కష్టంగా మారింది. ఇప్పటికే కెనడాలో ఉన్న భారతీయుల హక్కులపై పరిమితి విధించడం జరిగింది. ఇవన్నీ ప్రవాస భారతీయుల్లో అసంతృప్తిని పెంచాయి. వీరు గురుద్వారాల్లో, హిందుస్థానీ సమాఖ్య సమావేశాల్లో కలుసుకొని తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించేవారు. ఇదే సమయంలో ప్రవాసీల్లో జాతీయతా భావనలు పెరిగాయి. బ్రిటిష్ పాలన నుంచి స్వదేశానికి విముక్తి కల్పించాలన్న ఆలోచన పలువురిలో కలిగింది. ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీ విద్యార్థుల్లో జాతీయవాద చైతన్యం ఉప్పొంగనారంభించింది. ఇందుకు హర్దయాళ్, తారక్నాథ్ దాస్ తదితరుల ఉపన్యాసాలు దోహదం చేశాయి. వీరికి భారతీయ విప్లవకారుడు రాస్‌బీహారీ బోస్‌తో సంబంధాలు పెరిగాయి. ‘పసిఫిక్ కోస్ట్ హిందుస్తానీ’ దేశానికి విప్లవ మార్గంలో స్వాతంత్య్రం సంపాదించాలన్న ఆలోచనతో ఇలాంటి భావనలున్న వారంతా కలిసి పసిఫిక్ కోస్ట్ హిందుస్తానీ అసోసియేషన్ గా 1913 జూలై 15న ఏర్పడ్డారు. ఇదే తదనంతరం గదర్‌పార్టీగా మారింది. సోహన్ సింగ్ భక్నా దీనికి తొలి అధ్యక్షుడు. ఇందులో భాయ్ పర్మానంద్, హర్ దయాల్, మొహమ్మద్ ఇక్బాల్ శేదై, కర్తార్ సింగ్ శరభ, అబ్దుల్ హఫీజ్ బరకాతుల్లా, సులామన్ చౌదరి, అమీర్ చౌదరి, రష్బీరి బోస్, గులాబ్ కౌర్ తదితరులు కీలక సభ్యులు. – దుర్గరాజు శాయి ప్రమోద్ (చదవండి: గాంధీజీ ప్రసంగం అనువాదం! వెంకట సుబ్బమ్మ) -
ప్రవాసి భారతీయ దివాస్-2022: దేశమేదైనా అండగా మేమున్నాం
ఇంజనీరింగ్ చదివి అప్పుచేసి ఆశల రెక్కలు తొడుక్కుని ఖతర్ లో అడుగు పెట్టాడు శివ. వైట్ కాలర్ జాబ్ చేసి.. నాలుగు రాళ్లు వెనకేసి కుటుంబాన్నీ నిలబెట్టడమే అతని లక్ష్యం. కానీ విమానం దిగగానే అతని కలలు చెదిరిపోయాయి. ఏజెన్సీ నిర్వాహకులు చేసిన మోసంతో దేశం కానీ దేశంలో నిలువనీడ లేకుండా కట్టు బట్టలతో నిలబడ్డాడు. కడుపు నింపుకోవడానికి మరో మార్గం లేక అక్కడే భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. అయితే అతని కథ విన్న ఓ ప్రవాస భారతీయ సంక్షేమ సంస్థ అతనికి అండగా నిలబడింది. విదేశాల్లో ఉండే రూల్స్ గురించి వివరించి, తమకున్న పరిచయాలతో అక్కడే ఓ సంస్థలో ఇంజనీర్ గా ఉద్యోగం ఇప్పించింది. దీంతో శివ అతని కుటుంబం నిలదొక్కునే అవకాశం వచ్చింది. కానీ ఇలాంటి సాయం దొరక్క అభాగ్యులుగా మిగిలిపోయేవారు ఎందరో... అందుకే విదేశాల్లోని తమ వారికి అండగా ఉండేందుకు ప్రభుత్వ ఏర్పాట్లకు అదనంగా సేవలు అందిస్తున్నాయి ప్రవాసి సంస్థలు. మేమున్నాం అంటూ విదేశాల్లో మన వాళ్ళకి అండగా నిలుస్తున్నాయి. అంతేకాదు స్థానికంగా సమస్యల పరిష్కారానికి ఉడతా భక్తి సాయం అందిస్తూ పుస్తకాల పంపిణీ, మంచి నీటి సౌకర్యం, టెక్నాలజీ సాయం చేస్తున్నాయి. ప్రవాసీల పండుగ ప్రవాస భారతీయులు, భారతీయ సంతతి ప్రజలతో మాతృదేశంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, రాజకీయంగా, ఆర్థికంగా, దాతృత్వపరంగా భారతదేశ అభివృద్ధికి ప్రవాసులు చేసిన కృషికి గుర్తుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 9న ప్రవాసి భారతీయ దివస్ నిర్వహిస్తున్నారు నేపథ్యం మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి 1915 జనవరి 9 తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని 2003 నుండి ప్రతిఏటా ప్రవాసి భారతీయ దివస్‌ను జరుపుకుంటున్నారు. సంఖ్య చిన్నదే..ప్రభావం పెద్దదే..! విదేశాల్లో ఉన్న భారత ప్రవాసీలు 3 కోట్ల మంది. అనగా... భారతీయ జనాభాలో విదేశాలలో నివసించేవారు 3 శాతం లోపే... సంఖ్య చిన్నదే అయినా వీరి ప్రభావం పెద్దది. అవకాశాల భూమి అమెరికా... దశాబ్దాలుగా విభిన్న రంగాలలో భారతీయ నిపుణులను ఆకర్షిస్తోంది. అధిక జీతాలు, ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలు ఉన్నత స్థానానికి అధిరోహించే అవకాశం. అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్ళడానికి ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరో వైపు ఎప్పటి నుంచో భారతీయ కార్మిక వర్గం, ప్రొఫెషనల్స్ ని అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నాయి గల్ఫ్ దేశాలు. బ్రిటిష్ వలస పాలన సమయంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ దీవులు, తూర్పు ఆసియా దేశాలైన మలేసియా, సింగపూర్ లలో కూడా ప్రవాస భారతీయులు గణనీయంగా ఉన్నారు. బ్రిటన్, కెనడా దేశాల్లో పంజాబీ ల హవా ఉండగా.. గల్ఫ్ దేశాల్లో కేరలీయులు చొచ్చుకుపోయారు. అయితే ఈ దేశాల్లో అమెరికా, గల్ఫ్ దేశాల్లో తెలుగు సంఘాలు సాటి భారతీయుల కోసం ఎనలేని కృషి చేస్తున్నాయి. అమెరికాలో నాట్స్, ఆటా, తానా, ఏటీఎస్, వంటి సంస్థలు కతర్ లో ఇండియన్ కమ్యూనిటీ బెనువలెంట్ ఫోరమ్ (ఐసీబీఎఫ్), తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్, చాలా దేశాల్లో తెలంగాణ జాగృతి, గల్ఫ్ ప్రాంతంలో గల్ఫ్ జెఏసీ, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక, ఇండియాలో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం, వివిధ రాజకీయ పార్టీల ప్రవాసీ విభాగాలు ఇలా వందలకొద్ది సంస్థలు సేవలు అందిస్తున్నాయి. తిరిగి ఇవ్వాలనే - మిథిలారెడ్డి (ఖతార్) ఇండియా మాకు అన్నీ ఇచ్చింది. చదువు, ఉద్యోగం, హోదా.. వాటితోనే మేము గల్ఫ్ దేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. తిరిగి మాతృ దేశానికి ఏదైనా చేయాలనే తలంపుతోనే వ్యక్తిగతంగా, వేకువ ఫౌండేషన్ ద్వారా చేతనైనంత సాయం చేస్తున్నాం. మా సంఘం సభ్యులు తెలంగాణ లోని తమ స్వంత ఊర్లకు, మేము మా స్వంత జిల్లా మహబూబ్‌నగర్ లో రెగ్యులర్‌గా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటాం. టెక్నాలజీ అందించాలని - ప్రీతిరెడ్డి, టిడిఎఫ్-అమెరికా వ్యవసాయం రంగంలో అమెరికా అధునాత పద్దతులను పాటిస్తున్నది. తెలంగాణ లోని రైతులు స్వయం సమృద్ధి సాధించేందుకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పక్షాన 'జై కిసాన్' కార్యక్రం చేపట్టాము. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, తేనెటీగల పెంపకం లాంటి పద్దతులపై ఎంపిక చేసిన గ్రామాలలో రైతులకు శిక్షణ అందిస్తున్నాము. చదవండి: మొదటి 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా' కార్డు గ్రహీత మన హైదరాబాదీ! -
మన టీకా కోసం ప్రపంచం నిరీక్షణ
ఔషధ రంగంలో భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఇనుమడిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కోవిడ్–19 మహమ్మారిని కట్టడి చేయడానికి మన దేశం ఇప్పటికే రెండు టీకాలను అభివృద్ధి చేసిందని, వాటి కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని అన్నారు. అలాగే అతిపెద్దదైన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇండియా ఎలా అమలు చేయనుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. ప్రధాని శనివారం 16వ ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ) ప్రారంభోత్సవంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎక్కడైనా గొప్పగా వెలిగిపోతోంది అంటే అది భారత్‌లో మాత్రమేనని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దేశంలో ప్రజాస్వామ్యం మనుగడపై ఎంతోమంది ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారని, అవన్నీ పటాపంచలు అయ్యాయని ఉద్ఘాటించారు. మన దేశంలో తయారైన వస్తువులను మరిన్ని ఉపయోగించాలని ప్రవాస భారతీయులకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో మన చుట్టుపక్కల నివసించే వారిలోనూ ఆయా వస్తువులు వాడాలన్న ఆకాంక్ష పెరుగుతుందని చెప్పారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ వేగంగా అడుగులేస్తోందని, ‘బ్రాండ్ ఇండియా’ ఉద్దీపనలో ప్రవాస భారతీయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రపంచానికి మన దేశం ఒక ఔషధాగారంగా మారిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు అవసరమైన ముఖ్యమైన ఔషధాలను భారత్ సరఫరా చేస్తోందని చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో 16న భారత్ కీలకమైన ముందడుగు వేయబోతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్. వ్యాక్సిన్ పంపిణీలో వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, సఫాయి కర్మచారీలు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రాధాన్యం లభిస్తుంది. – ట్విట్టర్లో మోదీ -
‘పాస్‌పోర్ట్, వీసా నిబంధనలు సరళతరం’
వారణాసి : పాస్‌పోర్ట్‌తో పాటు వీసా నిబంధనలనూ తమ ప్రభుత్వం సరళతరం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు . ఈ - వీసాతో ఎన్ఆర్ఐల విలువైన సమయం ఆదా అవుతుందని, సమస్యలనూ అధిగమించవచ్చని చెప్పారు. పీఐఓ కార్డులను ఓసీఐ కార్డులుగా మార్చేందుకూ తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.ప్రపంచానికి పలు అంశాల్లో భారత్ నేతృత్వం వహిస్తోందని, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) వీటిలో ఒకటని చెప్పుకొచ్చారు. ఈ వేదిక కేంద్రంగా ఒక ప్రపంచం, ఒక సూర్యుడు, ఒకే గ్రిడ్ అనే స్ఫూర్తితో మనం ముందుకెళతామని చెప్పారు. ప్రధాని తన నియోజకవర్గం వారణాసిలో మంగళవారం 15వ ప్రవాసి భారతీయ దివస్‌ను ప్రారంభించి సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు అలహాబాద్‌లో కుంభమేళాకు హాజరవడంతో పాటు, రిపబ్లిక్ డే వేడుకలను తిలకించేందుకు వీలుగా ఈ ఏడాది ప్రవాసి భారతీయ దివస్‌ను జనవరి 21 నుంచి 23 వరకూ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. నూతన భారత్ ఆవిష్కరణలో భారత సంతతి పాత్రను ఈ ఏడాది సదస్సుకు ప్రధాన థీమ్‌గా ఎంపిక చేశారు. -
దుబాయి, దోహాలో ప్రవాసీ భారతీయ దివస్
దుబాయి : మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన 1915 జనవరి 9ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 2003 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా యూఏఈలోని దుబాయి ఇండియన్ కాన్సులేట్, ఖతార్‌లోని దోహా ఇండియన్ ఎంబసీల ఆధ్వర్యంలో ఈనెల 9న ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహించారు. ఇందులో అధికారులతో పాటు పలువురు తెలంగాణ ప్రవాసీలు పాల్గొన్నారు. -
దివాస్ తేదీ మార్పుపై మండిపడ్డ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : ప్రవాసీ భారతీయ దివాస్ తేదీ మార్పుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రవాసీ భారతీయ దివాస్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్, ఎన్నారై ప్రతినిధులు దేవేందర్ రెడ్డి, భీమ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం 2003 లోనే ప్రారంభమైందని అన్నారు. దివాస్‌ను అవమానపరచేలా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జనవరి9న ప్రతిఏటా జరిగే ప్రవాసీ భారతీయ దివాస్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉందని తెలిపారు. ప్రవాసీయులు తమ సంపాదనలో కొంత దేశ ప్రయోజనాలకోసం ఉపయోగిస్తున్నారని చెప్పారు. కనీసం 3 కోట్ల మంది ఎన్నారైలు ఉన్నారని తెలిపారు. ఎన్నారైలు దేశానికి ఆర్థికంగా వెన్నెముకగా నిలబడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి ఎన్నారైలను అవమానపరచేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రవాసీ భారతీయ దివాస్ నిర్వహణ తేదీ జనవరి 26 కు మార్చడం సరైనదికాదని అన్నారు. కేవలం బీజేపీ స్వార్ధప్రయోజనాల కోసమే దివాస్ తేదీని మార్చారని నిప్పులు చెరిగారు. ఈ ఏడాది నరేంద్ర మోదీ దివాస్ ను వారణాసిలో జనవరి 26న నిర్వహించాలని చూస్తున్నారని, మోదీ సర్కారు దివాస్‌ను జనవరి 9న యథావిధిగా ఢిల్లీలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరపున జనవరి 9న ఢిల్లీలో ఆమ్ ప్రవాసి దివాస్ పేరుతో తామే నిర్వహిస్తామన్నారు. ఎన్నారైల కోసం ప్రాక్సీ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టాలని, ఏమిగ్రేషన్ బిల్లు కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. -
ఏ దేశమేగినా..
నిర్మల్: ‘ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవమును..’ అన్న పాటను అణువణువునా నింపుకుని వెళ్లారు. పరాయిగడ్డపై అడుగుపెట్టిన తర్వాత తల్లి భారతికి ఇచ్చిన మాటను మరువలేదు. విదేశీయ మోజు ఎంతున్నా.. స్వదేశీ సంస్కృతిని వీడటం లేదు. అమ్మకు వేల మైళ్ల దూరంలో ఉంటున్నా.. కమ్మనైన అమ్మదనాన్ని ప్రతిక్షణం తలచుకుంటూనే ఉన్నారు. ‘మనుషులుగానే మేం ఇక్కడున్నాం.. మా మనసంతా అక్కడే ఉంది..’ అని చెబుతుంటే వాళ్ల గొంతుల్లో ఈ మట్టిపై ఉన్న మమకారం వినిపిస్తోంది. ఎప్పుడో తరాల కిందటి నుంచే ఉపాధి కోసం.. ఉద్యోగం కోసం రెక్కలు కట్టుకుని సప్తసముద్రాలు దాటుకుంటూ విదేశాలకు వెళ్తున్న మనోళ్లు.. ఈ ప్రపంచం నలుదిశలా ఉన్నారు. ఏ దేశానికి వెళ్లినా.. ఎక్కడ ఉంటున్నా.. మనదైన సంస్కృతీ వారసత్వాన్ని వదలడం లేదు. వాళ్లు పాటిస్తూ.. విలువలను ఆచరిస్తూ.. తమ ముందు తరాలకూ అందిస్తున్నారు. అక్కడే పుట్టి.. అక్కడే పెరిగిన పిల్లలు ఆంగ్లాన్ని అనర్గళంగా మాట్లాడుతూనే.. కమ్మనైన అమ్మభాషలో అలవోకగా పలుకరిస్తున్నారు. అక్కడ చేసేది సాఫ్ట్వేర్ నౌకరీలైనా.. పాతకాలం పద్ధతులను ఇంకా పాటిస్తున్నారు. తామున్న రంగంలో.. తాముంటున్న ప్రాంతంలో భారతీయతను చాటుతున్నారు. ‘ప్రవాసీ దివస్’ను పురస్కరించుకుని ప్రత్యేక కథనం. పేరుకే విదేశం.. అంతా మనదే.. 1947కి ముందు ప్రపంచ దేశాలు మనవైపు చూశాయి. వ్యాపారం పేరుతో వచ్చి దేశ సొత్తును దోచుకెళ్లాయి. ఏళ్ల పాటు మనల్ని బానిసలుగా పాలించిన విషయమూ తెలిసిందే. కానీ ఇప్పుడు భారతీయులు మనదేశంలో లేకుంటే అభివృద్ధి ఆగిపోతుందని ఆగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని వర్గాలు నినదిస్తున్నాయి. ఈ విషయంలో అక్కడి అధ్యక్షుడి తీరునే చాలామంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. అంటే అంతగా అమెరికాలో మనవాళ్లు స్థానం సంపాదించుకున్నారు. మైక్రోసాఫ్ట్‌కు సత్యనాదెళ్ల, పెప్సీ–కోకు ఇంద్రానూయి, గూగుల్‌కు సుందర్‌పిచాయ్ సారథ్యం వహిస్తున్నారు. ఇలాంటి మేటి కంపెనీలు కాకుండా విదేశాల్లోని చిన్న చిన్న వందల వేల సంస్థలకు మనవాళ్లే మార్గదర్శకులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయా దేశాల అభివృద్ధిలో.. అక్కడి వారికి ఉపాధి కల్పించడంలో మనవాళ్లు భాగస్వాములవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచీ విదేశాల్లో వందల సంఖ్యలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇతర రంగాల్లో సేవలందిస్తున్న వారు ఉన్నారు. సంస్కృతిని కాపాడుకుంటూ.. మనం మరిచిపోతున్న పండుగలను విదేశాల్లో ఉంటున్న మనోళ్లు గుర్తుచేసే పరిస్థితి వస్తోంది. అంటే అక్కడ ఉంటున్న వాళ్లు అంత పక్కాగా పండుగలు, ఆచారాలను ఆచరిస్తున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, హోలీ, రక్షాబంధన్.. తదితర పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. దుబాయ్ వంటి నిబంధనలు ఉండే దేశంలోనూ జిల్లావాసులు దసరా ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. అమెరికాలో దీపావళి పర్వదినాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల వారితో కలిసి జిల్లావాసులు సంబురంగా చేసుకుంటున్నారు. దక్షిణాఫ్రికా వంటి దేశంలో సంప్రదాయబద్ధంగా గణేశ్ నవరాత్రులు, నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇక ఆస్ట్రేలియా ఖండంలో ఉండే మనవాళ్లు ప్రతినిత్యం శివలింగానికి అభిషేక పూజలు చేస్తున్నారు. అమెరికాలో ఇటీవల ఆలయాల సంఖ్య పెరిగిపోతోంది. ఇలా ఎంతోమంది ఆదిలాబాద్ వాసులు ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. వారంతా భారతీయతను ప్రపంచానికి చాటే వారధులుగా నిలుస్తున్నారు. అత్యధికంగా ఆ దేశాల్లోనే.. భారతదేశం నుంచి ప్రపంచంలోని 208 దేశాలలో మొత్తం 1,33,27,438 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వీరు కాకుండా స్వల్పకాలికంగా విదేశాల్లో ఉంటున్న వారు 3కోట్ల 12లక్షలకు పైగా ఉన్నారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 20 నుంచి 25 వేల మధ్య ప్రవాస భారతీయులు ఉన్నట్లు అంచనా. ఇందులో అత్యధికులు నిర్మల్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస పోయినవాళ్లే ఉన్నారు. వీరి సంఖ్య దాదాపు 10వేల వరకు ఉంటుందని అంచనా. అధిక సంఖ్యలో భారతీయులు ఉన్న దేశాలు.. వారి సంఖ్య.. ఇండియాలో ఉన్నట్లే ఉంటాం.. పేరుకు అమెరికాలో ఉంటున్నా.. ధ్యాసంతా ఇంటిపైనే ఉంటుంది. ఇటీవలే నిర్మల్‌లో మూడు నెలలు ఉండి వచ్చాను. పిల్లలకు సంబంధించిన శుభాకార్యాలన్నీ అక్కడే చేస్తుంటాను. ఇక ఇంటికి వస్తే ఇండియాలో ఉన్నట్లే ఉంటాం. మేము, మా పిల్లలు అంతా తెలంగాణ యాసలోనే మాట్లాడుకుంటాం. ఇక్కడ పండుగలను చుట్టుపక్కల ఉండే తెలుగువాళ్లు, ఉత్తర భారతీయులతో కలిసి జరుపుకుంటాం. ఏ పండుగనూ మిస్ కానివ్వకుండా చేసుకుంటాం. వీలు దొరికినప్పుడల్లా ఆలయాలకు వెళ్లొస్తుంటాం. – బ్రహ్మరౌత్ సునీల్‌వర్మ,సాఫ్ట్వేర్ ఇంజినీర్, యూఎస్ఏ అమ్మానాన్నలు ఆశ్చర్యపోయారు.. పదమూడేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. ఇక్కడి బర్ని స్టేట్‌లో సూపర్‌మార్కెట్, పెట్రోల్‌బంక్ బిజినెస్‌లు ఉన్నాయి. భార్య కృష్ణ, కవల పిల్లలు దివి, ధన అందరం ప్రతీవారం ఇక్కడి శివాలయానికి వెళ్తుంటాం. అభిషేకాలు, పూజలు ఇండియాలో చేసినట్లే ఇక్కడ కూడా చేస్తుంటాం. ఇంట్లో అన్ని పండుగలనూ జరుపుకుంటాం. తెలుగువాళ్లందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. అమ్మానాన్నలు సుమతి, సత్యనారాయణ ఇక్కడా మన పద్ధతులు ఆచరించడం చూసి ఆశ్చర్యపోయారు. – నరాల రుక్మకేతన్, బిజినెస్‌మేన్, ఆస్ట్రేలియా -
విద్యా ప్రదాతలు
అన్నిదానాల్లో కెల్ల విద్యాదానం గొప్పదంటారు.. వ్యక్తి ఉన్నతికి చదువే ఆయుధం అని గ్రహించిన ప్రవాస భారతీయులు పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారు. కన్న నేలను, పెరిగిన గ్రామాన్ని మరవకుండా, సుదూర ప్రాంతంలో ఎంతోఎత్తులో ఉన్నా తమ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారు. పాఠశాల, కళాశాలల భవనాలను నిర్మించి, మౌలిక కల్పిస్తూ, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెల 9న ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉమ్మడి జిల్లాలోని ఎన్ఆర్ఐలపై ఈవారం వీకెండ్ స్పెషల్. లాటా.. తెలుగు బాట కోదాడఅర్బన్ : కోదాడ పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుడు సాతులూరి శ్రీధర్ అమెరికాలోని లాస్ఏంజెల్లో నివాసముంటున్నాడు. 14ఏళ్ల కిత్రం ఉద్యోగరీత్యా వెళ్లిన శ్రీధర్ అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ తెలుగు అసోసియేషన్‌ను స్థాపించి, వాటి కార్యకలాపాల నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నాడు. లాస్ ఏంజెల్లో తెలుగు అసోసియేషన్ (లాటా)కు రెండేళ్లు కార్యదర్శిగా పనిచేసిన ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖులను అక్కడికి ఆహ్వానించారు. ప్రస్తుతం లాటా బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌గా ఎన్నికై రెండేళ్లుగా పదవిలో కొనసాగుతున్నాడు. పాఠశాల ఏర్పాటు.. లాస్ ఏంజెల్లో స్థిరపడిన తెలుగువారి పిల్లలకు తెలుగు భాషను నేర్పేందుకు, వారు తెలుగులో పట్టు సాధించేందుకు పాఠశాలను స్థాపించాడు. వారాంతాలలో నిర్వహించే తరగతులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుర్తింపు కూడా ఉంది. ఈ పాఠశాలలో కోర్సులు పూర్తిచేసిన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు కూడా అందజేస్తుండడం గమనార్హం. అభివృద్ధికి విరాళాలు అమెరికాలోనే కాక తన సొంత ప్రాంతంలో కూడా శ్రీధర్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అక్కడ నివాసముండే తన సోదరి, సోదరుడి ద్వారా ఈ ప్రాంతంలోని మేళ్లచెర్వు మండలం రాఘవాపురంలోని ఆలయం, నేరేడుచర్ల మండలం కల్లూరులో దేవాలయాల అభివృద్ధికి విరాళాలు అందజేశాడు. మున్ముందు తన శక్తి మేర మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని శ్రీధర్ తెలిపాడు. మంచికంటి దాతృత్వం చండూరు(మునుగోడు): చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన డాక్టర్ మంచికంటి లక్ష్మయ్య 1976లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. తను సం పాదించిన దానిలో కొంత గ్రామానికి ఖర్చు చేయాలనే ఆలోచన, ఆనాడు కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. 2003లో తన నాయనమ్మ మంచికంటి గోపమ్మ స్మారకార్థం కోటి రూపాయలతో గ్రామంలో పాఠశాల భవనాన్ని, తండ్రి మంచికంటి యాదగిరి స్మారకార్థం రెండు కోట్ల రూపాయలతో జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించాడు. పాఠశాలను ప్రభుత్వానికి అప్పజెప్పగా, జూనియర్ కళాశాలను మంచికంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా నడుపుతున్నారు. తాజాగా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు.. మంచికంటి నిర్మాణం చేసిన భవనంలోనే ప్రాథమిక, ఉన్నత, జూనియర్ కళాశాల నడుస్తోంది. ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించగా, 12 మంది విద్యావలంటీర్లను ట్రస్ట్ నియమించింది. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు అంతా ఆంగ్ల మాధ్యమంలోనే ఉచితంగా బోధన చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉచిత బస్సుపాస్‌ల సౌకర్యం, జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్రస్ట్ ద్వారానే ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నారు. మెడిసిన్ చేయాలనుకునే వారికి చేయూత మెడిసిన్ చేయాలనుకునే విద్యార్థులకు ట్రస్ట్ సహకారం అందిస్తుంది. ఇప్పటికే ఓ విద్యార్థిని మెడిసిన్ చదువుతుంది. మరో ముగ్గురు విద్యార్థులకు మెడిసిన్ కోసం కోచింగ్ ఇప్పిస్తున్నారు. పేద విద్యార్థులు మెడిసిన్ చేయాలనుకున్నవారు ట్రస్ట్‌ను సంప్రదిస్తే ఉచితంగా చదివిం చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాడు. -
వాళ్లు అవినీతి ఆరాధకులు
నోట్ల రద్దు విమర్శకులపై ప్రవాసీ భారతీయ దివస్‌లో ప్రధాని ధ్వజం ► అవినీతి, నల్లధనంపై యుద్ధం చేస్తున్నాం ► పెద్ద నోట్ల రద్దు సాహసోపేత నిర్ణయం ► మద్దతిచ్చిన వారికి రుణపడతా ► త్వరలో ‘ప్రవాసీ కౌశల్ వికాస యోజన’ ► భారతీయుడినని గర్వపడతా: పోర్చుగల్ ప్రధాని సాక్షి, బెంగళూరు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారిపై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. నోట్ల రద్దును ప్రజా వ్యతిరేక నిర్ణయం అంటున్న వారు అవినీతి, నల్లధనానికి ‘రాజకీయ ఆరాధకులు’ అంటూ మండిపడ్డారు. బెంగళూరులో మూడు రోజుల పాటు జరిగే 14వ ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ) కార్యక్రమంలో రెండో రోజైన ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. నల్లధనానికి రాజకీయ ఆరాధకులు కొంతమంది మా ప్రయత్నాలను ప్రజా వ్యతిరేకం అని విమర్శిస్తున్నారు’’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయాలను, సమాజాన్ని, పరిపాలనను డొల్ల చేస్తున్న అవినీతి, నల్లధనంపై తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తోందని మోదీ చెప్పారు. ఈ యుద్ధానికి మద్దతు తెలుపుతున్న ప్రవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘పెద్దనోట్ల’రద్దు నిర్ణయాన్ని దేశంలోని సామాన్య ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. అవినీతి నిర్మూలనకు సాహసోపేత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తమ వెంటే ఉన్న దేశ ప్రజలందరికీ రుణపడి ఉంటానని చెప్పారు. ఎవరేమన్నా తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనన్నారు. నోట్ల రద్దు వల్ల భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని తెలిపారు. స్వచ్ఛభారత్, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా ద్వారా భారత్‌లోని ప్రతి ఒక్కరి అభివృద్ధితో భుజం కలిపే ఎన్ఆర్ఐలకు తమ ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని మోదీ చెప్పారు. ప్రవాసుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం.. ప్రవాస భారతీయుల రక్షణ, సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తుందని మోదీ చెప్పారు. తాము పాస్‌పోర్టు రంగును చూడబోమని, రక్తసంబంధాన్ని మాత్రమే చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మేధో వలసను (బ్రెయిన్ డ్రైన్) తగ్గించి, మేధోపయోగాన్ని (బ్రెయిన్ గెయిన్) పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ‘‘విదేశాల్లో మూడు కోట్ల మంది భారతీయులు ఉన్నారు. వీరి ద్వారా ప్రతి ఏటా 69 బిలియన్ డాలర్లు వివిధ రూపాల్లో భారత్‌కు వస్తున్నాయి. అభివృద్ధిలో వారి సహకారం ఎనలేనిది. ప్రవాసులకు అవసరమైన వసతి, పాస్‌పోర్టు వ్యవహారాల్లో న్యాయసహాయంతో పాటు ఇతర సహాయ సహకారాలు అందించాల్సిందిగా విదేశాల్లోని భారత ఎంబసీలకు సూచించాం. న్యాయపరంగా 24 గంటల్లో సహాయం అందించేందుకు ముందుంటాం. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రవాస భారతీయులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆ శాఖ మంత్రి సుష్మాజీ ఈ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నా ఉద్దేశంలో ఎఫ్‌డీఐకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే.. రెండోది ఫస్ట్ డెవలప్ ఇండియా. దీని వల్ల పెట్టుబడులు ఎంత ముఖ్యమో అందరూ అర్థం చేసుకోవాలి. భారత్‌లో పెట్టుబడులు పెట్టదలచిన ఎన్ఆర్ఐల కోసం ఎఫ్‌డీఐ నిబంధనలను పూర్తిగా సరళీకరించాం’అని మోదీ తెలిపారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు రప్పించి మోసం చేసే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా త్వరలో నూతన చట్టాలు రూపొందించనున్నామని వెల్లడించారు. ఓసీఐ ప్రక్రియ ప్రారంభమైంది.. ఫిజితో పాటు వివిధ దేశాలకు ఒప్పంద కూలీలుగా వెళ్లిన వారి వారసులు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులకు అర్హులని, దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని మోదీ తెలిపారు. పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐఓ) కార్డుతో ఫిజి, రీయూనియన్ ఐలాండ్స్, సూరినామ్, గయానాతో పాటు ఇతర కరేబియన్ దీవుల్లో ఉన్న ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అలాగే పీఐవో కార్డులను ఓసీఐ కార్డులుగా మార్చుకోవడానికి అపరాధ రుసుం లేకుండా జూన్ 30 వరకూ గడువు ఉందని, దీని కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని మోదీ చెప్పారు. ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహిస్తున్నందుకు కర్ణాటక ప్రభుత్వానికి ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 20కిపైగా స్టార్టప్‌ల విజయాలపై కాఫీటేబుల్ పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ స్వదేశానికి వచ్చిన రోజును ప్రవాసీ దివస్‌గా జరుపుకుంటున్నారు. దీనిని 2003లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 7 నుంచి 9 వరకూ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కార్యక్రమంలో పాల్గొనడానికి 6 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. భారతీయుడినని గర్వపడతా: పోర్చుగల్ ప్రధాని ప్రవాసీ భారతీయ దివస్‌లో ప్రధాని మోదీతో పాటు పోర్చుగల్ ప్రధాని ఆంటోనియా కోస్టా కూడా పాల్గొన్నారు. ఆంటోనియో పూర్వీకులు గోవాకు చెందినవారు. ఎప్పుడైనా భారత్‌కు వస్తే గోవా వెళ్లి తన బంధువులను కలుస్తానని ఆయన తెలిపారు. భారతీయుడినని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతానన్నారు. పోర్చుగల్, భారత్ మధ్య వివిధ రంగాల్లో వందల ఏళ్ల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. వాటిని మరింత మెరుగు పరుచుకోవడానికి ఇరుదేశాలు కృషిచేయాలని ఆంటోనియా కోస్టా అభిలషించారు. విదేశాలకు వెళ్లే వారికోసం ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన.. భారత్ నుంచి విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లే యువతలో నైపుణ్యం పెంచేందుకు త్వరలోనే ‘ప్రవాసీ కౌశల్ వికాస యోజన’అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా విదేశాలకు వెళ్లే యువతకు ఆయా దేశాల్లోని చట్టాలు, అక్కడి పని విధానం, భాష, సంస్కృతి సంప్రదాయాలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. దీంతో మొదటిసారిగా విదేశాలకు వెళ్లే యువతలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఆయా దేశాల్లోని పరిస్థితులకు తొందరగా అలవాటుపడగలరని చెప్పారు. -
బెంగళూరులో ప్రధాని మోదీ
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం అర్ధరాత్రి మోదీ బెంగళూరుకు చేరుకున్నారు. ఉన్నతాధికారులతో సహా ఎయిర్‌పోర్టుకు వచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. నేడు బెంగళూరులో రెండోరోజు జరగనున్న ప్రవాసి భారతీయ దివాస్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఈవెంట్ ఓవరాల్‌గా 14వ ప్రవాసీ భారతీయ దివాస్ కార్యక్రమం. 'యూత్ ప్రవాసీ భారతీయ దివాస్'గా ఈవెంట్‌కు నామకరణం చేశారు. స్టార్ట్ అప్ అండ్ ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ ఇన్ కర్ణాటకతో పలు కార్యక్రమాలను మోదీ ప్రారంభిస్తారు. నేడు జరగనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా విచ్చేయనున్నారు. భారతీయ మూలాలున్న ఆంటోనియో కోస్టా స్వతహాగా రచయిత. ఆంటోనియా తండ్రి ఓర్లాండో డీ కోస్టా.. గోవా ప్రాంతంలో జన్మించారు. నేటి ఈవెంట్లకు సంబంధించి కర్ణాటక అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సమాచారం. -
ప్రవాసీ దివస్‌కు అతిథిగా పోర్చుగీసు ప్రధాని
న్యూఢిల్లీ: జనవరి 7 నుంచి బెంగళూరులో నిర్వహించనున్న 14వ ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా భారతీయ మూలాలున్న పోర్చుగీసు ప్రధాని ఆంటోనియో కోస్టా హాజరుకానున్నారు. రచయిత అయిన ఆంటోనియా తండ్రి ఓర్లాండో డీ కోస్టా.. గోవా ప్రాంతంలో జన్మించారు. గతేడాది పోర్చుగీసు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆంటోనియా అక్కడి లిస్బన్ నగరంలో 1961లో జన్మించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు 8న భారతీయ దివస్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆంటోనియో అంగీకరించారని విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. -
దేశానికి ఆంధ్రప్రదేశ్ గేట్‌వే లాంటిది: చంద్రబాబు
గాంధీనగర్ : దేశానికి ఆంధ్రప్రదేశ్ గేట్‌వే లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుజరాత్లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సులో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ సూర్యోదయ రాష్ట్రమని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల వల్ల దేశానికి గుర్తింపు వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు. పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నామని, విశాఖలో మెగా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రతి గ్రామాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని, వచ్చే నెల నుంచి ఈ-బిజ్ను ప్రారంభిస్తామని బాబు తెలిపారు. -
భారత్‌లోనే కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి
-
రండి... దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కండి
గాంధీనగర్: దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని ఎన్నారై యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం గాంధీనగర్‌లో ప్రారంభమైన ప్రవాస్ భారతీయ దివాస్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుష్మా... ఎన్నారై యువతతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వదేశంలో ఎన్నారైలు వ్యాపారాలు నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుష్మా స్వరాజ్ వివరించారు. అలాగే దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో తమ ప్రభుత్వం చేపట్టిన విధి విధానాలన్నీ పాదర్శకంగా అమలు పరుస్తున్నట్లు తెలిపారు. కమ్, కనెక్ట్, సెలబ్రెట్, కంట్రిబ్యూట్ అంటూ 'నాలుగు సీ'ల ప్రాముఖ్యతను సుష్మా ఈ సందర్భంగా ఎన్నారై యువతకు విశదీకరించారు. -
పురిటిగడ్డపై మమకారం
విదేశాల్లో ఉంటూ సొంతగడ్డలో సేవలు ప్రవాసీ భారతీయ దివస్’ ప్రత్యేక కథనం వృత్తి రీత్యా విదేశాల్లో.. సొంతగడ్డపైనే సేవా కార్యక్రమాలు మంచి నీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి విద్యార్థులకు చేయూత నేడు ప్రవాసీ భారతీయ దివస్ వృత్తి రీత్యా విదేశాల్లో స్థిరపడినా పురిటిగడ్డను మరువడం లేదు మెతుకుసీమ బిడ్డలు. డాక్టర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికా, లండన్ తదితర ప్రాంతాల్లో స్థిరపడిన జిల్లా వాసులు తమ సొంతగడ్డపై సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మంచినీటి ఎద్దడిని తీర్చడం, పేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేయడం, ఫర్నిచర్, కంప్యూటర్లు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరి స్థాయిని బట్టి వారు నిధులను సమకూరుస్తూ సొంతగడ్డపై ఉన్న మమకారాన్ని చాటిచెబుతున్నారు. నేడు ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా పలువురి సేవా కార్యక్రమాలు ఇలా... - న్యూస్‌లైన్ నెట్వర్క్ నీటి కష్టాలకు చెక్ వెల్దుర్తి: మండలం మాసాయిపేట గ్రామ మాజీ సర్పంచ్, మెదక్ సమితి ఉపాధ్యక్షుడు చిన్నచౌదరిగారి పెద్ద విఠల్‌రెడ్డి స్మారకార్థం ఆయన కుమారులు డాక్టర్ జీవన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రామచంద్రారెడ్డిలు మూడేళ్లుగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. జీవన్‌రెడ్డి లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కూడా తనవంతు సహాయాన్ని అందజేస్తున్నారు. పెద్ద విఠల్‌రెడ్డి పేరిట వీరు ఇప్పటివరకు రూ.40 లక్షలతో వాడవాడలా 36 మినీ నీటి ట్యాంకులను ఏర్పాటుచేసి, మూడు బోర్లు వేసి, మోటార్లను బిగించి మహిళల నీటి కష్టాలను తీర్చారు. పశువుల ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.5 లక్షల విలువ గల స్థలాన్ని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవనం కోసం రూ.4 లక్షల విలువ చేసే స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. స్థానిక లైబ్రరీకి రూ.10 వేల విలువ గల ఫర్నిచర్‌ను సమకూర్చారు. పాఠశాల లో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు సమకూరుస్తూ క్రీడలు నిర్వహిస్తుంటారు. ఏటా విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు జీవన్‌రెడ్డితోపాటు అతని సోదరులు. ఉజ్వల్‌రెడ్డి.. ఉత్తమ సేవలు జహీరాబాద్: వృత్తి రీత్యా దేశం కాని దేశానికి వెళ్లి స్థిరపడిన ప్రవాస భారతీయుడు ఎస్.ఉజ్వల్‌రెడ్డి తాను పుట్టిన ఊరిని మరువలేదు. జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి గ్రామానికి చెందిన ఈయన రెండు దశాబ్దాల క్రితం వైద్యుడిగా అమెరికాలో స్థిరపడ్డారు. అయినప్పటికీ అడపాదడపా స్వగ్రామానికి వస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. స్థానికులతో కలుపుగోలుగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అతని సేవలను చిరాగ్పల్లి గ్రామస్థులు అభినందిస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత వేసవిలో రెండు బోర్లు వేయించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు. గ్రామానికే పరిమితం కాకుండా జహీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ మంచినీటి సమస్య ఎదురైనా అక్కడికి నీటిని పంపించేందుకు వీలుగా ప్రత్యేకంగా ట్యాంకర్‌ను సమకూర్చారు. అందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలానికి సైతం ప్రత్యేకంగా ఓ ట్యాంకర్‌ను కేటాయించారు. మూడు ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాల వారికి మంచి నీటిని అందిస్తున్నారు. చిరాగ్పల్లిలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం మూడు కంప్యూటర్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 120 బెంచీలను అందజేసి గ్రామానికి, విద్యార్థులపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. యువత, విద్యార్థులకు వాలీబాల్ మెటీరియల్‌తోపాటు ఇతర ఆటల సామగ్రిని సమకూర్చారు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో రెండు వేల మందికి వైద్య సేవలందించడంతోపాటు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. హోతి(కె) గ్రామంలో సైతం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. రక్తానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని గ్రామంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇలా పలు రకాల సేవలను కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తారని ఉజ్వల్‌రెడ్డి సన్నిహితులు తెలిపారు. విద్యార్థులకు అండగా ఎన్ఆర్ఐ ఇంజనీర్లు వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన వీరన్నగారి లింగారెడ్డి, పద్మ దంపతుల కుమారులు హరీష్‌రెడ్డి, రాకేష్‌రెడ్డిలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. సుమారు ఏడేళ్లుగా అక్కడే ఉంటున్న వారు పురిటి గడ్డను మరువకుండా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరు అప్పట్లో పదోతరగతి వరకు మాసాయిపేట ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసాన్ని సాగించారు. తాము చదువుకున్న పాఠశాలకు గుర్తింపు తేవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే పదోతరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.5 వేలు, ద్వితీయ స్థానంలో వచ్చిన వారికి రూ.3 వేలు, తృతీయ స్థానం సాధించిన వారికి రూ.2 వేల చొప్పున నగదు ప్రోత్సాహాన్ని ఏటా అందిస్తున్నారు. వీరు సొంతగడ్డకు రాకపోయినా అమెరికా నుంచే డబ్బులు పంపిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. -
సినీ హీరోగానే ఇక్కడికి వచ్చా: చిరంజీవి
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ జరిగితే మంచిదేనని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు చర్చకు వస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. విభజన అనివార్యమైతే బిల్లులో రెండు సవరణలు కోరతామన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలి, భద్రాచలంను సీమాంధ్రలో కలపాలని డిమాండ్ చేస్తామన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ప్రవాస భారతీయ దినోత్సవం(పీబీడీ)లో ఆయన పాల్గొన్నారు. కేంద్రమంత్రి కాకుండా సినీ హీరోగానే ఈ కార్యక్రమానికి హాజరైయ్యానని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరించే అవకాశాల్లేవని చిరంజీవి స్పష్టం చేశారు.