దేశానికి ఆంధ్రప్రదేశ్ గేట్వే లాంటిది: చంద్రబాబు | Andhra pradesh is gate way of India, chandrababu naidu | Sakshi
Sakshi News home page

దేశానికి ఆంధ్రప్రదేశ్ గేట్వే లాంటిది: చంద్రబాబు

Published Fri, Jan 9 2015 12:44 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

దేశానికి ఆంధ్రప్రదేశ్  గేట్వే లాంటిది: చంద్రబాబు - Sakshi

దేశానికి ఆంధ్రప్రదేశ్ గేట్వే లాంటిది: చంద్రబాబు

గాంధీనగర్ : దేశానికి ఆంధ్రప్రదేశ్ గేట్వే లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుజరాత్లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సులో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ సూర్యోదయ రాష్ట్రమని అన్నారు.
 
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల వల్ల దేశానికి గుర్తింపు వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు.

పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నామని,  విశాఖలో మెగా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రతి గ్రామాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని, వచ్చే నెల నుంచి ఈ-బిజ్ను ప్రారంభిస్తామని బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement