
సినీ హీరోగానే ఇక్కడికి వచ్చా: చిరంజీవి
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ జరిగితే మంచిదేనని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు చర్చకు వస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. విభజన అనివార్యమైతే బిల్లులో రెండు సవరణలు కోరతామన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలి, భద్రాచలంను సీమాంధ్రలో కలపాలని డిమాండ్ చేస్తామన్నారు.
ఢిల్లీలో జరుగుతున్న ప్రవాస భారతీయ దినోత్సవం(పీబీడీ)లో ఆయన పాల్గొన్నారు. కేంద్రమంత్రి కాకుండా సినీ హీరోగానే ఈ కార్యక్రమానికి హాజరైయ్యానని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరించే అవకాశాల్లేవని చిరంజీవి స్పష్టం చేశారు.