ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన
అమరావతి: మండలంలోని జూపూడిలో గురువారం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, అధికారులు పర్యటించి పేదల జీవన స్థితిగతులపై అధ్యయనం చేశారు. వరల్డ్‌బ్యాంకు ప్రతినిధులు సాహితి, జాన్‌సన్, అభిషేక్ గుప్తా సయ్యద్, పాల్ ఆదాయ వనరులు, కుటుంబ పరిస్థితి, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. డీఆర్డీఏ పీడీ హబీబ్‌బాషా మాట్లాడుతూ వరల్డ్ బ్యాంకు సహకారంతో వెలుగు ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్న 150 మండలాలను ఎంపిక చేశారన్నారు. అందులో భాగంగా జూపూడి గ్రామాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఐదేళ్లపాటు ఈ గ్రామాలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు. అనంతరం అమరావతి వెలుగు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఏరియా కో-అర్డినేటర్ సత్యసాయి, డీపీఎం గౌరీనాయుడు, కిరణ్‌కుమార్, శర్మ, ఏపీఎం సునీత పాల్గొన్నారు.