పీసీసీ సభ్యుడిగా చిరంజీవి | Chiranjeevi appointed PCC member | Sakshi
Sakshi News home page

పీసీసీ సభ్యుడిగా చిరంజీవి

Published Fri, Oct 6 2017 10:44 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Chiranjeevi appointed PCC member - Sakshi

ఏలూరు(సెంట్రల్‌) : జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా రాజ్య సభ సభ్యుడు చిరంజీవి నియమితులయ్యారు. జిల్లాల వారీగా పీసీసీ సభ్యులను నియమిస్తూ గురువారం రాత్రి  ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 17 మంది సభ్యులను నియమించారు. ముందుగా కొవ్వూరు బ్లాక్‌–1 పీసీసీ సభ్యురాలిగా కాపవరం పంచాయతీ సర్పంచ్, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఎండీ.అమరజహా బేగ్‌ను నియమించారు.

 అయితే రాజ్య సభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా స్థానం కావాలని కోరడంతో అమరజహా బేగ్‌ తన స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. దాంతో చిరంజీవిని కొవ్వూరు బ్లాక్‌–1 పీసీసీ సభ్యుడిగా నియమించారు. గురువారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ  కార్యాలయంలో పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు మహమ్మద్‌ రఫీఉల్లా బేగ్‌ విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడలో  పీసీసీ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నామని, అనంతరం పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు.

 కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జిల్లా నుంచి సభ్యత్వం కావాలని కోరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, ఆయన కోసం తన పీసీసీ పదవిని వదులుకున్న అమరజహా బేగ్‌ను ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో నాయకులు గెడ్డం సాయిబాబు, ఎం.థామస్, అజర్త్, రిజ్వన్, దాసు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement