
‘ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టండి’
ప్రత్యేక హోదా విషయంలో ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టి టీడీపీ, కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఇందిర భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక గంటలోపే ప్రత్యేక హోదా ఇవ్వొచ్చన్నారు.
ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నాడు ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నేడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నరేంద్రమోదీ వద్ద తాకట్టు పెట్టి తెలుగుదేశం పార్టీని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉంటూ కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా అమలు చేయించడంలో ప్రధాన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.