సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సిద్ధాంతం, జాతీయ రాజకీయాలపై విమర్శలు కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బీజేపీ, ప్రధానిపై ఎదురుదాడికి కాంగ్రెస్ చతుర్ముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సీనియర్లతో కమిటీ
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ప్రచారాన్ని ఏఐసీసీ సమీక్షించింది. గుజరాత్ కాంగ్రెస్ నేతలు, రాహుల్‌లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా వివరాలు సేకరించింది. స్థానికులు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలపై దృష్టిపెట్టాలని.. మోదీకి రోజుకో ప్రశ్న వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నలుగురు సీనియర్ నేతలు.. ప్రధాని ప్రసంగాలను విశ్లేషించి అందులోని అసత్యాలను ఎత్తిచూపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే.. ‘2012 ఎన్నికల ప్రచారంలో ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తానన్న మోదీ 4.72 లక్షల ఇళ్లనే కట్టించారని మిగిలినవి పూర్తయ్యేందుకు 45 ఏళ్లు పడుతుందా?’ అని రాహుల్ శుక్రవారం నాటి ప్రచారంలో ప్రశ్నించారు.
పటేళ్లు, దళితులను చేరుకునేలా!
మరోవైపు.. తమకు అనుకూలంగా ఉన్న పటీదార్లు, దళితులను చేరుకునేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తమపై చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలు చిదంబరం, ఆనంద్ శర్మ, అశోక్ గెహ్లాట్, రణ్‌దీప్ సుర్జేవాలా, సచిన్ పైలట్, సుష్మిత దేవ్‌లు ఇకపై రోజూ మీడియాతో మాట్లాడనున్నారు. సంఘ్ హిందూత్వ ఎజెండాను తిప్పికొట్టేందుకు స్వాతంత్య్ర పోరాటంలో సంఘ్ శక్తుల పాత్రను తరచూ ప్రస్తావించాలని నిర్ణయించారు.
షా హిందువు కాదు జైన్: రాజ్ బబ్బర్
బీజేపీ జాతీయాధ్యక్షుడు జైన మతానికి చెందినా హిందువుగా చెప్పుకుంటారని కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ విమర్శించారు. ‘రాహుల్ గాంధీ కుటుంబంలో శివభక్తి తరతరాలుగా కొనసాగుతోంది. ఇందిర రుద్రాక్ష ధరించేవారు. శివుడిని ఆరాధించేవారే రుద్రాక్ష ధరిస్తారు. అమిత్ జైన్ అయినా హిందువని చెప్పుకుంటారు’ అని బబ్బర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ చతుర్ముఖ వ్యూహం
Published Sat, Dec 2 2017 3:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment