comittee
-
రెజ్లర్ల ఉద్యమం.. పర్యవేక్షక కమిటీలోకి బబితా
మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంపై మేరీకోమ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తమ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే కమిటీ ఏర్పాటుకు ముందు తమను సంప్రదించలేదని రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తాజాగా పర్యవేక్షణ కమిటీలో కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత, రెజ్లర్ బబిత ఫొగట్‌ను ఆరో సభ్యురాలిగా చేర్చినట్టు కేంద్ర క్రీడాశాఖ మంగళవారం ప్రకటించింది. కాగా కమిటీలో మేరీకోమ్‌తో పాటు మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ షట్లర్ తృప్తి ముర్గుండె, రాధిక శ్రీరామ్, రాజేశ్ రాజగోపాలన్‌లు ఉన్నారు. తాజాగా బబితా ఈ కమిటీలో ఆరో సభ్యురాలిగా చేరింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్ నియంతృత్వ ధోరణిని రెజ్లర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం డబ్ల్యూఎఫ్ఐ రోజువారి వ్యవహారాలను పర్యవేక్షక కమిటీనే చూస్తోంది. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం.. కీలక పరిణామం
భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ భారత రెజ్లర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐ పదవి నుంచి ఆయనను తొలగించాలంటూ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద మూడురోజులుగా ఆందోళన చేపట్టారు. గురువారం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రెజ్లర్లు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలో వినేశ్ పొగాట్, భజరంగ్ పూనియా సహా మిగతా రెజ్లర్లు శుక్రవారం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ)కు లేఖ రాశారు. తాజగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత ఒలింపిక్ కమిటీ(ఐవోఏ) ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో మేరీకోమ్ సహా డోలా బెనర్జీ, అలకనంద ఆశోక్, యోగేశ్వర్ దత్, సహదేవ్ యాదవ్‌లతో పాటు ఇద్దరు అడ్వకేట్లు ఉన్నారు. కాగా సభ్యుల్లో ఒకరైన సహదేవ్ యాదవ్ మాట్లాడుతూ.. మేము ఆందోళన చేస్తున్న రెజ్లర్ల వాదనలు వింటాం. అభియోగాలను పరిశీలించిన తర్వాత నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన న్యాయం జరిగేలా చూస్తాం అని పేర్కొన్నారు. Indian Olympic Association (IOA) has formed a seven-member committee to probe the allegations of sexual harassment against WFI chief Brij Bhushan Sharan Singh. Members are Mary Kom, Dola Banerjee, Alaknanda Ashok, Yogeshwar Dutt, Sahdev Yadav and two advocates: IOA pic.twitter.com/BjuyEbUHZu — ANI (@ANI) January 20, 2023 చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. అథ్లెట్లకు షాక్?! ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు పంచాయతీ -
12వ తరగతి ఫలితాల నిర్ధారణపై కమిటీ
న్యూఢిల్లీ: 12వ తరగతి పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఆ తరగతి విద్యార్థుల ఫలితాలను నిర్ధారించే విధానాన్ని రూపొందించడానికి 13 మంది సభ్యులతో ఒక కమిటీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఏర్పాటు చేసిం ది. ఆ కమిటీ 10 రోజుల్లోగా నివేదిక సమర్పించనుందని శుక్రవారం సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. కమిటీలో తనతో పాటు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి విపిన్ కుమార్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కమిషనర్ నిధి పాండే, నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ వినాయక్ గార్గ్, సీబీఎస్ఈ డైరెక్టర్(ఐటీ) అంత్రిక్ష జోహ్రి, సీబీఎస్ఈ డైరెక్టర్(అకడమిక్) జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ తదితరులు సభ్యులుగా ఉంటారన్నారు. ఒకవేళ ఎవరైనా విద్యా ర్థుల పరీక్ష రాయాలనుకుంటే వారికి కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలను నిర్వహించాల ని కూడా ఆ సమావేశంలో నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ ఇప్పటికే రద్దు చేసి, విద్యార్థుల మార్కుల నిర్ధారణకు ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. -
మేమే కమిటీ వేస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: గత 20 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తోన్న రైతాంగం సమస్యల పరిష్కారానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేంగా గడ్డకట్టే చలినిసైతం లెక్కచేయకుండా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తోన్న రైతాంగం సమస్య పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కోర్టు ఎత్తిచూపింది. రైతుల సమస్య పరిష్కారం కాకపోతే ఇది జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఇదే నేపథ్యంలో యావత్ దేశంలోని రైతు సంఘాలతో కలిపి తామే ఒక కమిటీని నియమించనున్నట్టు తేల్చి చెప్పింది. సమస్య పరిష్కారం విషయంలో ఇరు పక్షాలకు చిత్తశుద్ధి అవసరమని చెప్పకనే చెప్పింది. చర్చలు ఫలవంతం కావాలన్న అభిలాశ ఇరుపక్షాలకూ ఉండాలని, అప్పుడే చర్చలు ఫలవంతం అవుతాయని కోర్టు అభిప్రాయపడింది. అటువంటి సంస్థల పేర్లను తెలియజేయాల్సిందిగా కోర్టు, ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్‌ని కోరింది. రేపటిలోగా చెప్పండి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తోన్న రైతాంగాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం రైతుల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఇది ఇలాగే కొనసాగితే ఇది జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉన్నదని అభిప్రాయపడింది. సంబంధిత రైతాంగం వాదనలను వినేందుకు సైతం కోర్టు సమ్మతిని తెలియజేసింది. అలాగే ప్రజాప్రయోజన వ్యాజ్యంపై రేపటిలోగా సమాధానమివ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ చర్యలు చేపట్టలేదని సొలిసిటర్ జనరల్ విచారణ సందర్భంగా కోర్టుకి వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా రైతులకు సూచించాలని ఆయన కోర్టుని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జరిపిన చర్చలు సత్ఫలితాలనివ్వలేదని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించారు. -
సినీ సమస్యలపై హై లెవెల్ కమిటీ వేయండి
సాక్షి, హైదరాబాద్: చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మహిళా సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలసి వినతి పత్రం అందజేశాయి. చిత్ర పరిశ్రమలోని కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వర్తింప చేయాలని, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. స్పందించిన మంత్రి.. త్వరలో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని, సమస్యలపై చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో పీవోడబ్లు్య నాయకురాలు సంధ్య, సామాజికవేత్త సుజన, న్యాయవాది సుజన, భూమిక, ఆశ, రజియా, కళావతి, సృజన, సుమిత్ర, ఝాన్సీ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ చతుర్ముఖ వ్యూహం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సిద్ధాంతం, జాతీయ రాజకీయాలపై విమర్శలు కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బీజేపీ, ప్రధానిపై ఎదురుదాడికి కాంగ్రెస్ చతుర్ముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. సీనియర్లతో కమిటీ ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ప్రచారాన్ని ఏఐసీసీ సమీక్షించింది. గుజరాత్ కాంగ్రెస్ నేతలు, రాహుల్‌లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా వివరాలు సేకరించింది. స్థానికులు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలపై దృష్టిపెట్టాలని.. మోదీకి రోజుకో ప్రశ్న వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నలుగురు సీనియర్ నేతలు.. ప్రధాని ప్రసంగాలను విశ్లేషించి అందులోని అసత్యాలను ఎత్తిచూపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే.. ‘2012 ఎన్నికల ప్రచారంలో ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తానన్న మోదీ 4.72 లక్షల ఇళ్లనే కట్టించారని మిగిలినవి పూర్తయ్యేందుకు 45 ఏళ్లు పడుతుందా?’ అని రాహుల్ శుక్రవారం నాటి ప్రచారంలో ప్రశ్నించారు. పటేళ్లు, దళితులను చేరుకునేలా! మరోవైపు.. తమకు అనుకూలంగా ఉన్న పటీదార్లు, దళితులను చేరుకునేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తమపై చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలు చిదంబరం, ఆనంద్ శర్మ, అశోక్ గెహ్లాట్, రణ్‌దీప్ సుర్జేవాలా, సచిన్ పైలట్, సుష్మిత దేవ్‌లు ఇకపై రోజూ మీడియాతో మాట్లాడనున్నారు. సంఘ్ హిందూత్వ ఎజెండాను తిప్పికొట్టేందుకు స్వాతంత్య్ర పోరాటంలో సంఘ్ శక్తుల పాత్రను తరచూ ప్రస్తావించాలని నిర్ణయించారు. షా హిందువు కాదు జైన్: రాజ్ బబ్బర్ బీజేపీ జాతీయాధ్యక్షుడు జైన మతానికి చెందినా హిందువుగా చెప్పుకుంటారని కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ విమర్శించారు. ‘రాహుల్ గాంధీ కుటుంబంలో శివభక్తి తరతరాలుగా కొనసాగుతోంది. ఇందిర రుద్రాక్ష ధరించేవారు. శివుడిని ఆరాధించేవారే రుద్రాక్ష ధరిస్తారు. అమిత్ జైన్ అయినా హిందువని చెప్పుకుంటారు’ అని బబ్బర్ పేర్కొన్నారు. -
బీడీ ఆకుల ధరల నిర్ధారణకు కమిటీ
హైదరాబాద్: రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో 2016 సీజన్లో బీడీ ఆకుల విక్రయ ధరలు, సేకరించే కూలీలకు కూలీ రేట్ల నిర్ధారణ కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రధాన సంరక్షణాధికారి ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించింది. బీడీ ఆకుల విక్రయానికి ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్డీసీ)ని ఏజెంటుగా నియమించింది. ఈమేరకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అశ్వనీ కుమార్ ఫరీడా గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. -
'కాపుల ఉద్యమానికి పెద్దన్నలా సహకరిస్తాం'
-
'కాపుల ఉద్యమానికి పెద్దన్నలా సహకరిస్తాం'
ఏలూరు: కాపుల ఉద్యమానికి పెద్దన్నలా సహకరిస్తామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఏలూరులో నగర తూర్పు కాపు కమిటి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆయన నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తూర్పుకాపులను ఓబీసీల్లో చేర్చేలా ఈ నెలలో జాతీయ కమిషన్‌ను కలువనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కన్వినర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.