హైదరాబాద్: రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో 2016 సీజన్‌లో బీడీ ఆకుల విక్రయ ధరలు, సేకరించే కూలీలకు కూలీ రేట్ల నిర్ధారణ కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రధాన సంరక్షణాధికారి ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించింది. బీడీ ఆకుల విక్రయానికి ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ)ని ఏజెంటుగా నియమించింది. ఈమేరకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అశ్వనీ కుమార్ ఫరీడా గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.