BD workers
-
Kerala: బీడీ కార్మికుని ఉదారత.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు..
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా కరోనా సునామీని సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ దీని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది ఉపాధిని సైతం కోల్పోయారు. మరికొందరు పొట్టకూటి కోసం చిన్నాచితకా పనులు చేస్తూ బతుకు బండిని లాగిస్తున్నారు. అయితే, ఇక్కడో వ్యక్తి.. తాను చేసేది చిన్న పనే అయినా.. సీఎం సహయ నిధికి పెద్ద మొత్తంలో విరాళం పంపి గొప్ప మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కన్నూర్‌కు చెందిన ఓ బీడీ కార్మికుడు కేరళ సీఎం సహాయ నిధికి రూ.2 లక్షలు పంపించాడు. తన సొమ్మును వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించాలని కోరాడు. ఇలా డబ్బులు పంపిన తర్వాత అతని అకౌంట్లో కేవలం రూ.850 మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం. అయితే, బీడీకార్మికుడు బ్యాంక్ అధికారుల దగ్గరకు వెళ్లి తన అకౌంట్లోని రూ.2 లక్షలను సీఎం సహయ నిధికి బదిలీ చేయాలని కోరగానే బ్యాంకు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. నీ అకౌంట్లో తక్కువ మొత్తంలో డబ్బు ఉందని తెలిపారు. దాన్ని కూడా విరాళంగా ఇచ్చేస్తే ఎలా జీవనం సాగిస్తావని ప్రశ్నించారు. దీనికి అతను.. ఇక మీదటకూడా బీడీలు చుట్టి బతుకుతానని తెలిపాడు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ బీడీవర్కర్ ఉదార స్వభావాన్నిసోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ ట్విటర్ వేదికగా స్పందించారు. బీడి కార్మికుడి ఉదార స్వభావాన్ని మెచ్చకున్నారు. నెటిజన్లు సైతం ‘మీ మానవత్వానికి హ్యట్సాఫ్... మీరు చాలా మందికి ఆదర్శం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
లీజు రెన్యువల్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: తన స్థలంలో ఉన్న ప్రభుత్వ డిస్పెన్సరీ లీజు పునరుద్ధరణ(రెన్యువల్)కు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వడానికి కార్మిక శాఖ నిరాకరించడంపై ప్రధాని మోదీ ఆంటీగా చెప్పుకుంటున్న 90 ఏళ్ల మహిళ అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించింది. గుజరాత్‌లోని వాద్నగర్లో దహిబెన్ నరోత్తమ్‌దాస్ మోదీ నివసిస్తున్నారు. ఆమెకు చెందిన స్థలంలో బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ నడుస్తోంది. 1983లో రూ. 600 అద్దె ఇవ్వగా.. అనంతరం రూ.1,500కు పెంచారు. అప్పటి నుంచి అద్దె పెంచకపోవడంతో గత ఏడాది డిసెంబర్లో లీజు వివరాలు, పునరుద్ధరించక పోవడానికి కారణాలు చెప్పాలంటూ కార్మిక శాఖకు సమాచార హక్కు చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. సరైన సమాధానం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)కి దహిబెన్ ఫిర్యాదు చేశారు. గత వారం సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు వద్దకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. లీజును రెన్యువల్ చేయకపోవడంతో ఆ మొత్తంతో జీవించడం కష్టంగా మారిందని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఆమె మొదట దాఖలు చేసిన పిటిషన్‌కు సరైన సమాధానం రాకపోవడంతో.. 2018 జనవరి 9న ఆమె రెండో అప్పీలు దాఖలు చేశారు. అందులో తాను ప్రధాని మోదీ ఆంటీనని, తనకు న్యాయం జరగకపోతే ప్రధానికే ఈ విషయం తెలియజేస్తానని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో బంధుత్వం గురించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆమె అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ ఎందుకు సమాధానం ఇవ్వలేదని, ఆమె ఆర్టీఐ పిటిషన్‌ను విచారించిన అధికారులపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలపాలని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు ప్రశ్నించారు. -
మహిళా బీడీ కార్మికుల ఆందోళన
బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన నిబంధనను తొలగించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా దోమకొండలో సోమవారం భారీ ధర్నా జరిగింది. మహిళలు వందలాదిగా తహశీల్దార్ కర్యాలయం వద్దకు చేరుకుని తమ ఆందోళన తెలిపారు. -
బీడీ కార్మికుల భారీ ధర్నా
కరీంనగర్ జిల్లా కథలాపూర్‌లో సోమవారం బీడీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీడీ కట్టలపై హెచ్చరిక గుర్తును తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు. -
బీడీ ఆకుల ధరల నిర్ధారణకు కమిటీ
హైదరాబాద్: రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో 2016 సీజన్లో బీడీ ఆకుల విక్రయ ధరలు, సేకరించే కూలీలకు కూలీ రేట్ల నిర్ధారణ కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రధాన సంరక్షణాధికారి ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించింది. బీడీ ఆకుల విక్రయానికి ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్డీసీ)ని ఏజెంటుగా నియమించింది. ఈమేరకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అశ్వనీ కుమార్ ఫరీడా గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. -
'హైదరాబాదీనని కాలర్ ఎగరేసి చెప్పండి'
హైదరాబాద్:నగరంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఇకపై సెటిలర్స్ అనే పదాన్ని వాడొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నుంచి సెటిలర్స్ అనే పదానికి నగర ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ప్రాంతాలు, విభేదాలు మరచి హైదరాబాదీనని కాలర్ ఎగరేసి చెప్పాలని కేసీఆర్ సూచించారు. కేసీఆర్ విత్ యూ అనే విషయం మరచిపోవద్దని తెలిపారు. 2018 తర్వాత తెలంగాణలో పుట్టేవారికి విద్యుత్ కొరత అంటే తెలియదని.. వేసవిలో కరెంట్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర బడ్జెట్ బాగుండాలని తాను కోరుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ పై ఆరోపణలు పనికి మాలినవన్నారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్ట్ పై పునఃసమీక్ష చేస్తున్నామన్నారు. యాదగిరి గుట్టను అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేస్తామని కేసీఆర్ తెలిపారు. త్వరలో కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి సీఎంను కలిసి ఆల్మటి నుంచి నీటిని సాధించుకోస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛన్ అందజేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పష్టం చేశారు. మార్చి ఒకటవ తేదీ నుంచి ఆ పింఛన్ ను అందజేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మొత్తంగా ఉన్న బీడీ కార్మికులు నాలుగు లక్షల 90 వేల మంది ఉన్నారని.. అర్హులైన వారు ఎమ్మార్వో ఆఫీస్ నుంచి దరఖాస్తు పంపాలని ఆయన తెలిపారు. దీనిపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... బీడీ కార్మికులు ఎవరూ అనవసర ఆందోళనకు గురి కావద్దని సూచించారు. తమ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
బీడీ కార్మికులకు రూ.1000 పింఛన్: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికులకు ఉపశమన కల్గించే చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం బీడీ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛన్ అందజేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పష్టం చేశారు. మార్చి ఒకటవ తేదీ నుంచి ఆ పింఛన్ ను అందజేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మొత్తంగా ఉన్న బీడీ కార్మికులు నాలుగు లక్షల 90 వేల మంది ఉన్నారని.. అర్హులైన వారు ఎమ్మార్వో ఆఫీస్ నుంచి దరఖాస్తు పంపాలని ఆయన తెలిపారు. దీనిపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... బీడీ కార్మికులు ఎవరూ అనవసర ఆందోళనకు గురి కావద్దని సూచించారు. తమ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
బీడీ కార్మికులకు భరోసా
బీడీ కార్మికుల పోరాటాలు ఫలించాయి. బతుకుదెరువు కోసం బీడీలు చుడుతూ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నవారికి ‘ఆసరా’ లభించనుంది. బీడీ కార్మికులకు రూ.వెయ్యి జీవన భృతి అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. మంగళవారం నుంచి జిల్లాలో వివరాల సేకరణ చేపట్టనున్నారు. - కరీంనగర్ కరీంనగర్ : జిల్లాలో 1.20 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. వీరిలో 60 వేలకుపైగా మంది పీఎఫ్ ఉన్నవారు. వీరిలో ఇప్పటికే ఆసరా పథకం కింద వివిధ రకాల పింఛన్లు పొందుతున్న వారు 15 శాతం దాకా ఉంటారు. మిగతా 60వేల మంది వర్దీ బీడీలు చేస్తున్నవారే. పీఎఫ్ ఉన్నవారికి జీవనభృతి కింద లబ్ధి చేకూరే అవకాశముండగా.. వీరికి ప్రతీనెలా రూ.5 కోట్ల మేర ప్రయోజనం చేకూరే అవకాశముంది. జిల్లాకు త్వరలో పర్యవేక్షణ కమిటీ బీడీ కార్మికుల స్థితిగతులు, కార్మికుల పనిదినాలు, వారికి వస్తున్న ఆదాయంపై సీనియర్ ఐఏఎస్ అధికారి పూలం మాలకొండయ్య నేతృత్వంలో పర్యవేక్షణ జరగనుంది. రాష్ట్రంలో మొదట కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కమిటీ పరిశీలించనున్నట్లు తెలిసింది. ఫిబ్రవరిలో ఈ కమిటీ నివేదిక సమర్పించగానే బీడీ కార్మికులకు పింఛన్ అమలుచేసే అవకాశముంది. వివరాల సేకరణ, కమిటీ నివేదిక అనుకున్న ప్రకారం అందితే మార్చి నెల నుంచే ఒక్కో కార్మికురాలికి నెలకు రూ.వెయ్యి జీవనభృతిగా అందనుంది. పీఎఫ్ కార్డుల ఆధారంగా బీడీ కార్మికులను గుర్తించాలని సమీక్షలో నిర్ణయించగా... చాలా కంపెనీలు పీఎఫ్ ఖాతాలు తెరవలేదని సమాచారం. దీంతో సమగ్ర సర్వేలో ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించనున్నారు. పోరాటం ఫలిచింది - ఎర్ర కేతక్క, బీడీ కార్మిక సంఘం నాయకురాలు నలభై ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించింది. కేసీఆర్ హామీని నిలుపుకున్నందుకు సంతోషం. రోగాల పాలవుతున్న కార్మికులకు ఆసరా పథకం వరంలాంటిది. సలాం కేసీఆర్ - కూడలి పద్మ, బీడీ కార్మికురాలు బీడీ కార్మికుల అవస్థలు తెలుసుకున్న కేసీఆర్‌కు బీడీ కార్మికుల నుంచి సలాం చేస్తున్న. ఆసరా అందించాలన్న ఆలోచనే అద్భుతం. మాకు వెయ్యి రూపాయలంటే హజార్ బీడీ లెక్క. అందరికీ ఇవ్వాలి - షకీలా, బీడీ కార్మికురాలు రోజంతా బీడీలు చేసినా పూట గడవడం కష్టమే. బీడీలు చుట్టేవాళ్లందరికీ పింఛన్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో అధికారులు కొర్రీలు పెట్టకుండా చూడాలి. మాది చేతల ప్రభుత్వం... రూప్సింగ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు హామీలను దశలవారీగా అమలు చేస్తూ చేతల ప్రభుత్వంగా నిరూపించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి.