బీడీ కార్మికులకు రూ.1000 పింఛన్: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికులకు ఉపశమన కల్గించే చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం బీడీ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛన్ అందజేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పష్టం చేశారు. మార్చి ఒకటవ తేదీ నుంచి ఆ పింఛన్ ను అందజేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మొత్తంగా ఉన్న బీడీ కార్మికులు నాలుగు లక్షల 90 వేల మంది ఉన్నారని.. అర్హులైన వారు ఎమ్మార్వో ఆఫీస్ నుంచి దరఖాస్తు పంపాలని ఆయన తెలిపారు.
దీనిపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... బీడీ కార్మికులు ఎవరూ అనవసర ఆందోళనకు గురి కావద్దని సూచించారు. తమ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.