కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత నుంచి ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ఇప్పటికి కూడా ఉద్యోగాల కోత ఆగడం లేదు. లేఆప్స్ భారిన పడిన వేలాది మంది ఉద్యోగుల్లో భారతీయులు సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గత నెలలో కూడా రిక్రూటింగ్ టీమ్ నుండి వందలాది మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కొందరు తమ అసహనాన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఒక వ్యక్తి జాబ్ కోల్పోయిన తరువాత లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేస్తూ.. తాను రిటైర్మెంట్ వరకు అక్కడే పనిచేస్తానని భావించినట్లు, ఇంత త్వరగా ఉద్యోగం కోల్పోతానని ఊహించలేదని వెల్లడించాడు.
టెక్ దిగ్గజంలో పనిచేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు.. మళ్ళీ అవకాశం దొరికితే తప్పకుండా సంస్థలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయని తెలిపాడు. సంస్థ విశేషమైన వ్యక్తులతో కూడిన ఒక అద్భుతమైన ప్రదేశమని కూడా ప్రస్తావించాడు.
ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ సూపర్‌కార్.. జెనీవా మోటార్ షోలో ఇదే స్పెషల్ అట్రాక్షన్!
గూగుల్ లేఆఫ్స్
గూగుల్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటి సారి కాదు. గత జనవరిలో ఏకంగా 12000 మందిని తొలగించడానికి కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే దశల వారీగా కొంతమందిని తొలగిస్తూ ఉంది. కాగా రానున్న రోజుల్లో మరింతమందిని తొలగిస్తుండగా లేదా అనే విషయాల మీద ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు. ఇంకా తొలగింపులు పర్వం ముగియలేదని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment