Woman claims company rejected her for being 'too fair' in Bengaluru, netizens confused - Sakshi
Sakshi News home page

ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! ఎక్కడంటే?

Published Thu, Jul 27 2023 8:08 AM | Last Updated on Thu, Jul 27 2023 9:40 AM

Woman rejected for job being too fair in bengaluru - Sakshi

ఉద్యోగమంటే టాలెంట్ చూసి ఇవ్వడం ఆనవాయితీ, అయితే బెంగళూరులో ఒక యువతి తెల్లగా ఉందన్న కారణంతో జాబ్ ఇవ్వలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, బెంగళూరులో ఒక సంస్థ ఉద్యోగ ప్రకటన చూసి 'ప్రతీక్ష జిక్కర్' అనే యువతి అప్లై చేసుకుంది. కంపెనీ నిర్వహించిన పరీక్షలో విజయం పొందింది, ఆ తరువాత జరిగిన మూడు రౌండ్లను కూడా ఆమె పూర్తి చేసింది. అయితే చివరికి కంపెనీ మాత్రం ఈమెను రిజెక్ట్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఆమె తెల్లగా ఉండటమే అని సంస్థ తెలిపింది.

కంపెనీ పంపిన మెయిల్‌లో 'మేము మీ ప్రొఫైల్ చూసాము, ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు మీకు ఉన్నాయి, కానీ మా మొత్తం టీమ్‌లోని ఇతర సభ్యులకంటే తెల్లగా ఉండటం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నామని' తెలిపింది. ఈ విషయాన్ని ప్రతీక్ష జిక్కర్ లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..)

నిజానికి కంపెనీ మెయిల్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, మనిషి రంగును బట్టి కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని నేను ఊహించలేదు, మనిషి కలర్ కాకుండా ప్రతిభను బట్టి ఉద్యోగం ఇవ్వాలని కంపెనీని కోరుతూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన చాలామంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. బహుశా ఇలాంటి సంఘటన బెంగళూరులో వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కావచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement