
ఉద్యోగం కోసం సెర్చ్ చేసేవారిలో 82 శాతం లేదా 10 మందిలో 8 మంది ఆన్‌లైన్(లింక్డ్ఇన్)లో వెతుకుతున్నారు. స్కామర్లు, సైబర్ నేరగాళ్లు పెరిగిపోయిన తరుణంలో ఫేక్ రిక్రూటర్లు తయారవుతున్నారు. ఉద్యోగార్థులు తప్పుదోవపట్టిస్తున్నారు. కొందరు డబ్బు కూడా వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ కథనంలో ఆన్‌లైన్ జాబ్ సెర్చింగ్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరంగా తెలుసుకుందాం.
జాబ్ సెర్చింగ్‌లో ఉద్యోగార్థులు సురక్షితంగా ఉండటానికి, వారికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని 'సేఫర్ ఇంటర్నెట్ డే' (Safer Internet Day) సందర్భంగా.. లింక్డ్ఇన్ (LinkedIn) ఇండియా లీగల్ & పబ్లిక్ పాలసీ హెడ్ 'అదితి ఝా' (Aditi Jha) పేర్కొన్నారు. జాబ్ పోస్టింగ్‌లను జాగ్రత్తగా సంప్రదించడం, అప్లై చేసుకునే ముందు అందుబాటులో ఉన్న మొత్తం సమాచారం తెలుసుకోవడం ముఖ్యని అన్నారు.
సేఫ్ జాబ్ సెర్చింగ్ కోసం టిప్స్
మీరు ఎలాంటి వివరాలను పంచుకుంటున్నారో చూసుకోండి. ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు ముందు బ్యాంక్ వివరాలను ఇవ్వకండి.
అనుమానాస్పదమైన అభ్యర్థనలకు నో చెప్పండి. ఇంటర్వ్యూ కోసం ఎన్‌క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయమని అడగడం, ఎక్కువ జీతం.. తక్కువ పని వంటి ఆఫర్స్ ఇవ్వడం వంటి వాటిపై జాగ్రత్త వహించండి.
ఉద్యోగం కోసం ముందుగానే డబ్బు చెల్లించాలి అని చెప్పే.. పోస్టింగుల పట్ల జాగ్రత్త వహించండి. డబ్బు పంపమని, క్రిప్టోకరెన్సీ, గిఫ్ట్ కార్డ్‌లు పంపమని లేదా పెట్టుబడి పెట్టమని అడిగే వారికి స్పందించకపోవడం ఉత్తమం.
మీ సెట్టింగ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. మీ ఖాతాకు అదనపు ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామాను యాడ్ చేయడం వల్ల.. మీ పాస్‌వర్డ్‌ను మరచిపోయిన సమయంలో ఇవి ఉపయోగపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment