బడ్జెట్‌ బూస్ట్‌, మా ఆదాయం రూ. 2500 కోట్లకు పెరగొచ్చు- నితిన్‌ కామత్‌ | Budget 2024 boost for Zerodha: Nithin Kamath says we may earn Rs 2500 crore from STT hike | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ బూస్ట్‌, మా ఆదాయం రూ. 2500 కోట్లకు పెరగొచ్చు- నితిన్‌ కామత్‌

Published Tue, Jul 23 2024 5:32 PM | Last Updated on Tue, Jul 23 2024 5:42 PM

Budget 2024 boost for Zerodha: Nithin Kamath says we may earn Rs 2500 crore from STT hike

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ  జెరోధాకు ఎస్‌టీటీ బూస్ట్‌

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం రెట్టింపు కావచ్చు- జెరోధా సీఈవో

2024 బడ్జెట్‌లో సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్‌టిటి) రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే.  దీనిపై ప్రముఖ  బ్రోకరేజ్ సంస్థ  జెరోధా సీఈవో  ఎక్స్‌లో  స్పందించారు.  తాజా కేంద్ర  బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  ప్రతిపాదనతో తమకు రెట్టింపు లాభాలొస్తాయంటూ ట్వీట్‌ చేశారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌  కొలువు దీరిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో  స్టాక్ మార్కెట్‌లకు సంబంధించి అనేక మార్పులను ప్రకటించారు. ముఖ్యంగా సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్‌టిటి)ను ప్రస్తుత 0.01 శాతం నుండి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్ 1 నుండి  ఇది అమల్లోకి రానుంది. ఈ  పెంపు ద్వారా తాము  రూ. 2,500 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తెలిపారు. గత ఏడాది ఈ పన్ను ద్వారా 1500కోట్లు వసూలు అయ్యాయి.   ఇపుడిక ట్రేడింగ్ వాల్యూమ్‌లు తగ్గకపోతే కొత్త ధరల ప్రకారం రూ. 2,500 కోట్ల వరకు పెరగొచ్చని లెక్కలు చెప్పారు.

బడ్జెట్ 2024-మార్కెట్‌-ప్రతిపాదనలు
స్థిరాస్తి విక్రయానికి సంబంధించిన పన్నుల కోసం ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని కూడా తొలగించింది. అలాగే ఆస్తి విక్రయంపై మూలధన లాభాల పన్నును ప్రస్తుత 20 శాతం నుండి 12.5 శాతానికి తగ్గించింది.

దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10శాతం నుంచి 12.5శాతానికి  పెంచారు.

స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును 15శాతం నుంచి 20శాతానికి పెంచారు. ఈ రెండూ నేటి నుంచి అమలులోకి రానున్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement