భారతదేశంలోని బిలియనీర్లలో ఒకరైన జరోధా సీఈఓ 'నితిన్ కామత్' ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లిష్టమైన ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం చెప్పారు. బెంగళూరు జరిగిన టెక్‌స్పార్క్స్ 2024 ఈవెంట్‌లో యువర్‌స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ.. భారతీయులు ధనవంతులను ఎందుకు ద్వేషిస్తారు? అని ప్రశ్నించారు.
ధనవంతుల విషయంలో భారతీయులకు, అమెరికన్లకు మధ్య వ్యత్యసాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. యుఎస్‌లో ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదించి.. లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తే, అలాంటి విషయాలను న్యూస్ పేపర్ కవర్ పేజీ మీద ముద్రిస్తారు. అక్కడ ఇదంతా సర్వ సాధారణం.
కానీ.. భారతదేశంలో ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు అంటే.. ఏదో తప్పుడు దారిలో డబ్బు సంపాదిస్తున్నారని చాలామంది భావిస్తారు. ఆ తరువాత వాళ్ళను ద్వేషించడం మొదలుపెడతారు. అమెరికా పూర్తిగా పెట్టుబడిదారీ సమాజం, భారత్ మాత్రం పెట్టుబడిదారీ సమాజంగా నటిస్తున్న సోషలిస్టు సమాజం అని అన్నారు. ఇప్పటికీ చాలామంది ప్రజల గుండెల్లో సోషలిస్టు భావాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైనా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భారతీయులు పేదరికాన్ని గౌరవ చిహ్నంగా ధరిస్తారని ఒకరు అన్నారు. భారతదేశంలో, ధనికులు తగిన పన్నులు చెల్లించకుండా, మోసాలకు పాల్పడుతున్నారని, పేద.. మధ్యతరగతి వర్గాలను దోపిడీ చేయడం ద్వారా ధనవంతులు అవుతున్నారని మరొకరు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment