రాయగడ (భువనేశ్వర్): జిల్లాలోని చందిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ముకుందపూర్‌లో శుక్రవారం మావోయిస్టుల బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న చందిలి పోలీస్‌స్టేషన్ అధికారి బిజయలక్ష్మి హికాక హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని, ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ లేఖ ఓ మిఠాయి వ్యాపారిని ఉద్దేశించి రాసినదిగా గుర్తించారు.
ముకుందపూర్‌కు దగ్గరలోని హతికుంబ సమీపంలో ఉన్న శివాలయం వద్ద మిఠాయి వ్యాపారికి ఆ లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలలోపు రూ.7 వేలు చెల్లించాలని, లేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని లేఖలో హెచ్చరిస్తూ ఉంది. ఇదే లేఖ ప్రతి మరొకటి ఆ వ్యాపారి దుకాణం వద్ద లభించింది. ఈ లేఖలు మావోయిస్టుల నియమగిరి కమిటీ పేరిట వెలువడ్డాయి. అయితే ఇది మావోయిస్టులే విడుదల చేశారా.. లేకపోతే మావోయిస్టుల పేరుతో ఎవరైనా ఆకతాయిలు విడుదల చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ లేఖతో చుట్టుపక్కల గ్రామస్తుల్లో భయాందోళన ఏర్పడింది.
మావోయిస్టుల బెదిరింపు: 3 గంటల్లోగా డబ్బులు ఇవ్వకపోతే..?
Published Sat, Sep 4 2021 2:26 PM | Last Updated on Sat, Sep 4 2021 2:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment