
కాళేశ్వరం : కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డారంటూ నలుగురు చిన్నారులను దుకాణం యజమాని గుంజలకు కట్టేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లికి చెందిన నలుగురు చిన్నారులు తన దుకాణంలో నగదు చోరీ చేస్తున్నట్లు గుర్తించిన యజమాని మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం తన దుకాణం ముందు పందిరి గుంజలకు చిన్నారులను తాడుతో కట్టేసి, కొద్దిసేపయ్యాక పిల్లల తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి అప్పగించాడు. దీనిని కొందరు స్థానికులు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : నిజాంపేట్‌లో అపార్ట్‌మెంట్లకు ఏమైంది!)