భార్య ముందు అంకుల్‌ అన్నందుకు చితక బాదాడు | Bhopal Man Thrashes Shopkeeper For Calling Him Uncle Infront Of His Wife, More Details Inside | Sakshi
Sakshi News home page

భార్య ముందు అంకుల్‌ అన్నందుకు చితక బాదాడు

Published Mon, Nov 4 2024 9:40 AM | Last Updated on Mon, Nov 4 2024 9:57 AM

Bhopal Man Thrashes Shopkeeper For Calling Him Uncle

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజధాని నగరం భోపాల్‌లో రెండు రోజుల క్రితం విచిత్ర సంఘటన జరిగింది. భార్యకు చీరలు కొనడానికి వెళ్లిన రోహిత్‌ అనే వ్యక్తి షాపు యజమానిని చితకబాదాడు. ఇంతకీ కారణమేంటంటే భార్యతో కలిసి చీరలు కొంటున్న రోహిత్‌కు షాపు యజమాని విశాల్‌ చాలా చీరలు చూపించాడు. ఎన్ని చీరలు చూసినా  రోహిత్‌ దంపతులు ఒక్కటీ సెలెక్ట్‌ చేయలేదు. 

దీంతో విసుగెత్తిన విశాల్‌ మీకు వెయ్యి రూపాయల రేంజ్‌లో చీరలు కావాలా అని అడిగాడు. ‘మేం అంతకంటే ఎక్కువ రేంజ్‌ చీరలే కొనగలం, మమ్మల్ని తక్కువ అంచనా వేయకు’అని రోహిత్ షాపు యజమాని విశాల్‌పై అగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విశాల్‌ స్పందిస్తూ ‘అంకుల్‌ మీకు అన్ని రేంజ్‌ల చీరలు చూపిస్తాను’అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. 

భార్య ముందు అంకుల్‌ అనడంతో రోహిత్‌ కోపం కట్టలు తెంచుకుంది. షాపు నుంచి వెళ్లిపోయి కొద్ది సేపటికి స్నేహితులను వెంటేసుకొచ్చి షాపు యజమాని విశాల్‌ను కర్రలు, బెల్టులతో చితకబాది అక్కడి నుంచి పారిపోయారు.  

ఇదీ చదవండి: బలవంతంగా ఉమ్మి నాకించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement