
యువతులను వాహనంలో తరలిస్తున్న పోలీసులు
బనశంకరి: మద్యం మత్తులో ఉత్తర భారతదేశానికి చెందిన నలుగురు యువతులు, ఓ యువకుడు వీరంగం సృష్టించి ప్లవర్‌డెకరేటర్ దుకాణం యజమానిపై దాడి చేశారు. ఈఘటన అన్నపూర్ణేశ్వరినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సదరు యువతులు ఓ యువకుడితో కలిస మద్యం సేవించారు. సాయంత్రం నాగరబావి సిగ్నల్ సమీపంలో నమ్మూరతిండి హోటల్ వద్ద ఉన్న ప్లవర్‌డెకరేటర్ దుకాణం వద్దకు వెళ్లారు.
బొకేలు కొనుగోలు చేసే విషయంలో దుకాణం యజమానికి యువతుల మద్య వాగ్వాదం చేసుకుంది. దీంతో సదరు యువతులు దుకాణ యజమానిపై దాడి చేశారు. ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న స్థానికులతో గొడవకు దిగారు. అన్నపూర్ణేశ్వరినగరపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతులను, యువకుడిని అరెస్ట్ చేశారు. ఓ యువతి తప్పించుకోవడంతో గాలింపు చేపట్టారు.