రైల్లో మొబైల్‌ చోరీకి యత్నించిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే? | Thief Dangles From Moving train window after Failed Robbery attempt | Sakshi
Sakshi News home page

రైల్లో మొబైల్‌ చోరీకి యత్నించిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?

Published Wed, Jan 17 2024 7:31 PM | Last Updated on Wed, Jan 17 2024 8:19 PM

Thief Dangles From Moving train window after Failed Robbery attempt - Sakshi

బిహార్‌లో విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి నుంచి మొబైల్‌ చోరీ చేసేందుకు చేసిన ఓ దొంగ ప్రయత్నం బెడిసి కొట్టింది. సెల్‌ఫోన్‌  కొట్టేయడాన్ని గమనించిన ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకోవడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

భాగల్‌పూర్‌ స్టేషన్‌ దాటిన తర్వాత రైల్లోని మహిళా ప్రయాణికురాలి నుంచి  మొబైల్‌ ఫోన్‌ లాక్కోవడానికి బయట ఉన్న ఓ దొంగ యత్నించాడు. అయితే అప్రమత్తమైన సదరు ప్రయాణికురాలు దొంగ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా ఆమెకు సహకరించారు. దీంతో కదులుతున్న రైలు కిటికీ నుంచి ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. దాదాపు కిలోమీటర్‌ వరకు అలాగే ప్రయాణించాడు.

అయితే ఆ స్టేషన్‌లోని కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కదులుతున్న రైలు వెంబడి వారు పరుగెత్తారు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. దీన్నంతా తోటి ప్రయాణికులు వీడియో తీయగా.. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా గతంలో కూడా రైలు కిటికీలోంచి మొబైల్‌ దొంగలించబోయి అడ్డంగా బుక్కైన సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement