Viral Video: CISF Soldier Save Girl Who Stucked In Metro Station Grill In Delhi - Sakshi
Sakshi News home page

Viral Video: ఆపదలో చిక్కుకుంది.. రియల్‌ హీరో కంటపడింది.. ఊరుకుంటాడా?

Published Mon, Feb 28 2022 12:16 PM | Last Updated on Mon, Feb 28 2022 1:32 PM

CISF soldier Rescue Child At Delhi Metro Station Video Viral - Sakshi

నిజమైన హీరోలు ఎవరో తెలుసా?  దేశానికి కాపలా కాసే సైనికులు. అంతేనా.. ఆపదలో ఉన్నవాళ్లకు సాయం అందించేవాళ్లు కూడా ఆ ట్యాగ్‌కు అర్హులే. అలాంటిది ఆపదలో ఉన్న ఆ చిన్నారి రియల్‌ హీరో కంటపడింది. ఊరుకుంటాడా మరి?.. ఆ వీడియోనే ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

ఎనిమిదేళ్ల చిన్నారి మెట్రో స్టేషన్‌ దగ్గర ఆడుకుంటూ.. పైకి ఎక్కేసింది. తీరా  25 అడుగుల ఎత్తుకి చేరి.. అక్కడ చిక్కుకుపోయింది. భయంతో ఏడ్పు అందుకోగా.. ఆ ఏడ్పు  విన్న కొందరు.. అక్కడే ఉన్న కొందరు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని సాయం కోరారు. వెంటనే.. ఉరుకుల మీద అక్కడికి చేరుకున్నాడు ఓ సిబ్బంది.

జాగ్రత్తగా అక్కడికి చేరుకుని ఆ చిన్నారిని రక్షించి కిందకు తీసుకొచ్చాడు. ఆ దగ్గర్లోనే ఆ అమ్మాయి ఇళ్లు ఉందట!. అందుకే ఆడుకుంటూ అక్కడికి వెళ్లిపోయింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీ నిర్మాన్‌ విహార్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement