పౌరసత్వ నిరసన సెగలు ఢిల్లీ మెట్రోను తాకాయి. సుమారు నెలరోజులకు పైగా షాహీన్‌బాగ్‌లో నిరసనలు చేపట్టిన ఆందోళనకారులు తాజాగా శనివారం రాత్రి ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జాతీయ జెండాలు చేతబూని ఆజాదీ(స్వాతంత్ర్యం) కావాలంటూ గొంతెత్తి అరిచారు. చేతులకు నీలం రంగు బ్యాండ్ కట్టుకుని ‘జై భీమ్’ నినాదాలు చేశారు. ఇక సీఏఏను రద్దు చేసేవరకు ఇక్కడనుంచి కదిలేది లేదంటూ నిరసనకారులు తేల్చి చెప్తున్నారు.