ఢిల్లీ మెట్రో స్టేషన్‌ లో ఎస్‌ఐ ఆత్మహత్య | CISF sub-inspector commits suicide in Delhi Metro station | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మెట్రో స్టేషన్‌ లో ఎస్‌ఐ ఆత్మహత్య

Published Thu, Jan 5 2017 7:59 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

CISF sub-inspector commits suicide in Delhi Metro station

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఐఎస్ఎఫ్‌ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. సబ్‌ ఇన్స్‌ పెక్టర్‌ గా పనిచేస్తున్న భగత్‌ సింగ్‌ గురువారం మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ మెట్రో స్టేషన్‌ లోని సీసీ టీవీ కంట్రోల్‌ రూములో సర్వీసు తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కాల్ కాజీ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుకుంది.

సమాచారం అందుకున్న వెంటనే సీఐఎస్ఎఫ్‌, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగ్రాకు చెందిన భగత్‌ సింగ్‌ 2012లో సీఐఎస్ఎఫ్‌ చేరారు. ఆయన వివాహితుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement