జహంగీర్ పురి-బడ్లీ మధ్య ట్రయల్ రన్
♦ పరుగులు తీసిన మెట్రో రైలు
♦ {పాజెక్టు పనులు దాదాపు ఓ కొలిక్కి
♦ అనుమతి రాగానే అందుబాటులోకి
న్యూడిల్లీ : జహంగీర్ పురి-బడ్లీ మార్గంలో శుక్రవారం మెట్రో రైలు ప్రయోగాత్మకంగా పరుగులు తీసింది. యెల్లో లైన్ పొడగింపులో భాగంగా నిర్మించిన ఈ మార ్గంలో జహంగీర్‌పురి-హుడా సిటీ సెంటర్ మధ్య ఇప్పటికే మెట్రో రైలు సేవలందిస్తోంది. జహ ంగీర్‌పురి-బడ్లీ మధ్య దూరం 4.392 కిలోమీటర్లు. మూడోదశ కింద చేపట్టిన ఈ ఎలివేటెడ్ ప్రాజెక్టు పనులు దాదాపు ఓ కొలిక్కివచ్చాయి.
ట్రయల్ రన్‌లు, ప్రాథమిక లాంఛనాలు పూర్తవడంతోపాటు అనుమతులు అందినవెంటనే ఈ మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు శుక్రవారం డీఎంఆర్‌సీ వర్గాలు వెల్లడించాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఉత్తర ఢిల్లీ పరిధిలోని జహంగీర్‌పురి, సమయ్‌పూర్, బడ్లీ, ట్రాన్స్‌పోర్ట్‌నగర్, జీటీ కర్నాల్ రోడ్డు ప్రాంతాలతోపాటు రోహిణి పరిధిలోని కొన్ని ప్రాంతాలవాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఈ పనులు సజావుగా సాగాలంటే ఆయా సంస్థల మధ్య సమన్వయం అత్యంత అవసరం.
డీఎంఆర్‌సీకి భూసేకరణ సవాల్
న్యూఢిల్లీ: శరవేగంగా మెట్రో పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ)కు భూసేకరణ పెద్ద అవరోధంగా మారింది. ఈ విషయాన్ని డీఎంఆర్‌సీ చీఫ్ మంగూసింగ్ మీడియాకు వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మూడో దశలో భాగంగా మూడు ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన మెట్రో పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. ఈ అడ్డంకులు తొలిగిపోతే ప్రస్తుతం 190 కిలోమీటర్ల మేర జరుగుతున్న పనులను అదనంగా మరో 140 కిలోమీటర్ల మేర చేపట్టడానికి వీలవుతుందన్నారు.
ఈ సమస్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియాకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. తూర్పుఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలోగల కొన్ని కుటుంబాలు తాము ప్రకటించిన పునరావాస ప్యాకేజీని తిరస్కరించాయని చెప్పారు. అలాగే పశ్చిమ ఢిల్లీలోని మాయపురి, పంజాబీభాగ్‌లో మరికొన్ని కుటుంబాలు కూడా అంగీకరించలేదని తెలిపారు. పంజాబీభాగ్‌లో మురికివాడలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో ఈ సమస్య తలెత్తిందన్నారు.