న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో స్మార్ట్ కార్డ్ కనీస రుసుంను రూ.200కు పెంచారు. ఇది వచ్చే బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ఢిల్లీ మెట్రో అధికారులు ఆదివారం తెలిపారు. వివరాలిలా.. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము రూ.50 తో కలిపి కొత్త స్మార్ట్‌కార్డు విలువ రూ.150. ‘చాలామంది స్మార్ట్ కార్డ్ వినియోగదారులు రోజూ ప్రయాణం చేస్తుంటారు. కార్డు కనీస రుసుంను పెంచడం వల్ల రోజూ ప్రయాణించేవారికి కార్డును రీచార్జి చేయించుకోవడానికి ఎక్కువసార్లు లైన్లో నిల బడాల్సిన అవసరం తప్పుతుంది..’ అని అధికారి ఒకరు వ్యాఖ్యానిం చారు. రోజూ సుమారు 12 వేల మంది స్మార్ట్ కార్డులను వెనక్కి తీసుకుంటున్నారు. అలాగే 30 శాతం కార్డులను ఒకే నెల్లో కొని, వెనక్కి ఇచ్చేస్తున్నారు. దీంతో డీఎం ఆర్‌సీ సుమారు 9 లక్షల కార్డులను పునరుద్ధరించాల్సి వస్తోంది. మెట్రో కార్డు వినియోగించే ప్రయాణికులు తమ ప్రయాణంలో టికెట్‌పై 10 శాతం రాయితీ పొందుతున్న సంగతి తెలిసిందే.