చకచకా బడ్లీ మెట్రో కారిడార్ పనులు | DMRC to sign pact for new Metro line | Sakshi
Sakshi News home page

చకచకా బడ్లీ మెట్రో కారిడార్ పనులు

Published Tue, Jul 15 2014 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

DMRC to sign pact for new Metro line

 న్యూఢిలీ/నోయిడా: జహంగీర్‌పురి-సమయ్‌పూర్ బడ్లి మెట్రో కారిడార్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చినాటికల్లా ఈ మార్గం అందుబాటులోకి రావొచ్చని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఎలివేటెడ్ మార్గం. అప్, డౌన్‌లలో రెండు వంతెన మార్గాలను నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో బడ్లి మెట్రో స్టేసన్‌కు ముందు ఉత్తర రైల్వే పట్టాలు ఉంది. దీంతో దీనిని ఈ రైల్వే పట్టాలకు 12 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జహంగీర్‌పురి, కర్నాల్ రోడ్, రోహిణి, ట్రాన్స్‌పోర్టు నగర్, బడ్లి స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది మలుపులు ఉంటాయి. ‘ఈ విషయమై పనుల విభాగం డెరైక ్టర్ జితేంద్ర త్యాగి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
 
 ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ మార్గం వెంబడిగల ప్రాంతాలను కూడా అభివద్ధి చేస్తామన్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే 25 వేలమంది ప్రయాణికులు లబ్ధి పొందుతారన్నారు. నిర్మాణ పనులు దాదాపు 70 శాతం మేర పూర్తయ్యాయన్నారు. పనులు పూర్తయితే హుడా సిటీ సెంటర్-సమయ్‌పూర్ బడ్లీ లైన్ మెట్రో నెట్‌వర్క్‌లో ఈ మార్గం అత్యంత పెద్దదవువుతుందన్నారు. డీఎంఆర్‌సీతో త్వరలో ఒప్పందం మెట్రో మార్గం పొడిగింపు దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని నోయిడా చైర్మన్ రమారమణ్ వెల్లడించారు. ఈ విషయమై జాతీయ రాజధానిలో శనివారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి అలోక్ రంజన్ చర్చించినట్టు చెప్పారు.
 
 డీఎంఆర్‌సీతో ఒప్పందానికి యూపీ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. డీఎంఆర్‌సీ అధిపతి మంగూసింగ్ సమక్షంలో ఒప్పందాలపై ఇరు పార్టీలు సంతకాలు చేస్తాయన్నారు. కాగా బొటానికల్ గార్డెన్ (నోయిడా)-కాళిందికుంజ్ (ఢిల్లీ) మధ్య మెట్రో రైలు మార్గం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన మూడు సంవత్సరాల క్రితమే రూపుదాల్చింది. ఈ మార్గం పొడవు 3.9 కిలోమీటర్లు. ఈ ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గత జూన్ నెలలో లక్నోలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణికులు హుడా సిటీ సెంటర్-జహంగీర్‌పురి మార్గంలో ప్రయాణించడం కోసం రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.హౌజ్‌ఖాస్, ఎమిటీ విశ్వవిద్యాలయం, కాళిందీకుంజ్. కల్కాజీ స్టేషన్ల మీదుగా కాళిందీకుంజ్‌కు చేరుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement