చకచకా బడ్లీ మెట్రో కారిడార్ పనులు
న్యూఢిలీ/నోయిడా: జహంగీర్‌పురి-సమయ్‌పూర్ బడ్లి మెట్రో కారిడార్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చినాటికల్లా ఈ మార్గం అందుబాటులోకి రావొచ్చని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఎలివేటెడ్ మార్గం. అప్, డౌన్లలో రెండు వంతెన మార్గాలను నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో బడ్లి మెట్రో స్టేసన్‌కు ముందు ఉత్తర రైల్వే పట్టాలు ఉంది. దీంతో దీనిని ఈ రైల్వే పట్టాలకు 12 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జహంగీర్‌పురి, కర్నాల్ రోడ్, రోహిణి, ట్రాన్స్‌పోర్టు నగర్, బడ్లి స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది మలుపులు ఉంటాయి. ‘ఈ విషయమై పనుల విభాగం డెరైక ్టర్ జితేంద్ర త్యాగి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ మార్గం వెంబడిగల ప్రాంతాలను కూడా అభివద్ధి చేస్తామన్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే 25 వేలమంది ప్రయాణికులు లబ్ధి పొందుతారన్నారు. నిర్మాణ పనులు దాదాపు 70 శాతం మేర పూర్తయ్యాయన్నారు. పనులు పూర్తయితే హుడా సిటీ సెంటర్-సమయ్‌పూర్ బడ్లీ లైన్ మెట్రో నెట్‌వర్క్‌లో ఈ మార్గం అత్యంత పెద్దదవువుతుందన్నారు. డీఎంఆర్‌సీతో త్వరలో ఒప్పందం మెట్రో మార్గం పొడిగింపు దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని నోయిడా చైర్మన్ రమారమణ్ వెల్లడించారు. ఈ విషయమై జాతీయ రాజధానిలో శనివారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి అలోక్ రంజన్ చర్చించినట్టు చెప్పారు.
డీఎంఆర్‌సీతో ఒప్పందానికి యూపీ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. డీఎంఆర్సీ అధిపతి మంగూసింగ్ సమక్షంలో ఒప్పందాలపై ఇరు పార్టీలు సంతకాలు చేస్తాయన్నారు. కాగా బొటానికల్ గార్డెన్ (నోయిడా)-కాళిందికుంజ్ (ఢిల్లీ) మధ్య మెట్రో రైలు మార్గం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన మూడు సంవత్సరాల క్రితమే రూపుదాల్చింది. ఈ మార్గం పొడవు 3.9 కిలోమీటర్లు. ఈ ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గత జూన్ నెలలో లక్నోలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణికులు హుడా సిటీ సెంటర్-జహంగీర్‌పురి మార్గంలో ప్రయాణించడం కోసం రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.హౌజ్‌ఖాస్, ఎమిటీ విశ్వవిద్యాలయం, కాళిందీకుంజ్. కల్కాజీ స్టేషన్ల మీదుగా కాళిందీకుంజ్‌కు చేరుకోవచ్చు.