మొదలైన మెట్రో ఫేజ్-3 ట్రయల్న్
Published Tue, Dec 31 2013 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోరైలు ఫేజ్-3లో భాగంగా నిర్మించిన సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌస్ మధ్య మెట్రోరైలు ట్రయల్ రన్ సోమవారం ప్రారంభమైంది. ఢిల్లీ మెట్రోరైలు చైర్మన్ డా.సుధీర్‌కృష్ణ, డీఎంఆర్‌సీ ఎండీ మంగూసింగ్ సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్‌లో జెండా ఊపి రైలును ప్రారంభించారు. 24 నెలల్లోనే ఈ పనులు పూర్తి చేసి డీఎంఆర్‌సీ అధికారులు సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు మంగూసింగ్ తెలిపారు. రెండు నెలలపాటు ఈ ట్రయల్ రన్‌ను కొనసాగించనున్నట్టు చెప్పారు. సెంట్రల్ సెక్రటేరియట్-క శ్మీరీగేట్ కారిడర్‌లో భాగంగా మూడు కిలోమీటర్ల సొరంగమార్గం పనులు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. 2014 మార్చి వరకు ఈ కారిడర్ మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌస్ మార్గం అందుబాటులోకి వస్తే రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌పై ప్రయాణికుల రద్దీ చాలా వరకు తగ్గనుంది. మొదటి రోజు ట్రయల్ రన్ విజయవంతం అయినట్టు డీఎంఆర్‌సీ అధికారులు ప్రకటించారు. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఆజాద్‌పురలో మరో టీబీఎం పనులు షురూ
డీఎంఆర్‌సీ ఫేజ్-3లో భాగంగా ఆజాద్‌పుర్‌లో మరో టన్నెల్ బోరింగ్ మిషన్(టీడీఎం) పనులు సోమవారం ప్రారంభించినట్టు అధికారులు తెలిపా రు. ముకుంద్‌పుర-శివ్‌విహార్ కారిడర్‌లో భాగంగా చేపట్టిన ఈ పనులను డీఎంఆర్‌సీ ఎండీ మంగూసింగ్ ప్రారంభించారు. 2014 జూన్ వరకు ఈ టీబీ ఎం 1.4 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వేలా లక్ష్యం పెట్టుకున్నట్టు చెప్పారు. ఇదికాకుండా ఫేజ్-3లో మొత్తం 12 టీబీఎంలు పనిచేస్తున్నట్టు చెప్పారు.
Advertisement
Advertisement