తమన్నా
సాధారణంగా హిట్ వస్తే హీరో హీరోయిన్లు తమ పారితోషికాలను పెంచేస్తుంటారు. అయితే నటి తమన్నా మాత్రం ప్రస్తుతం సక్సెస్ లేకున్నా తన పారితోషికాన్ని పెంచాలని నిర్ణయించుకోవడం విశేషం. ఇంతకు ముందు తమిళంలో, ఆ తరువాత తెలుగు క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ పాలరాతి బొమ్మ ఆ మధ్య బాలీవుడ్‌లోను తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. అయి తే అక్కడ పోటీకి తట్టుకోలేకపోయిన తమన్నా మళ్లీ దక్షిణాదిపైనే గురిపెట్టింది.
కోలీవుడ్‌లో పైయ్యా, అయన్ వంటి చిత్రాల విజయం తో ప్రకాశించిన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అవకాశాలు కరువయ్యాయి. ఇటీవల టాలీవుడ్‌లోను అమ్మడి పరిస్థితి అలాగే ఉంది. అయితే తాజాగా మళ్లీ అవకాశాలు అమ్మడి తలుపు తడుతున్నాయి. ఈమె నటించిన వీరం సంక్రాంతి కారణంగా తెరపైకి రానుం ది. అదే విధంగా తెలుగులోనూ మహేశ్ బాబు సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అదేవిధంగా రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలిలో స్థానం సంపాదించుకుంది. తమిళంలోను మరిన్ని అవకాశాలు క్యూకడుతున్నాయి. దీంతో తమ న్న తన పారితోషికాన్ని పెంచాలని నిర్ణయించుకుందట.