ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అన్ని రకాల కాల పరిమితులు కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఎస్‌బీఐ మే నెలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్ల తగ్గడం వరుసగా రెండోసారి. తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లపై 40బేసిస్ పాయింట్ల(0.4శాతం) వరకు తగ్గించింది. ఈ తగ్గింపు మే 27నుంచే అమల్లోకి వస్తుంది. కొత్త రేట్ల ప్రకారం ఒక ఏడాది నుంచి రెండేళ్ల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 5.1శాతం మాత్రమే వడ్డీ వస్తుంది. 3-5 ఏళ్ల మద్య కాలపరిమితి గల 5.3శాతం, 5ఏళ్లకు పైబడి 10ఏళ్ల కాల పరిమితి కలిగి డిపాజిట్లపై వడ్డీ 5.4శాతం వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీ తాజా వడ్డీరేట్ల తగ్గింపు ఇలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment