IDBI Bank Introduces Special Fixed Deposit (FD) Scheme, Interest Rates & Other Details - Sakshi
Sakshi News home page

Fixed Deposit Scheme: అదిరిపోయే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం.. తక్కువ కాలపరిమితి.. ఎక్కువ వడ్డీ!

Published Mon, Jul 17 2023 4:22 PM | Last Updated on Mon, Jul 17 2023 4:43 PM

idbi bank launches special fixed deposit scheme minimum tenure maximum interest - Sakshi

తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీనిచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కోసం చూస్తున్నవారి కోసం ఐడీబీఐ బ్యాంక్‌ అదిరిపోయే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని తీసుకొచ్చింది. 375 రోజుల కాలపరిమితితో కొత్త ఎఫ్‌డీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జూలై 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ ఎఫ్‌డీ పథకంపై సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీ రేటును ఐడీబీఐ అందిస్తోంది.

‘అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ’ ప్రోగ్రాంలో భాగంగా ఈ కొత్త పథకాన్ని ఐడీబీఐ ప్రారంభించింది. కాగా ఇదే ప్రోగ్రాం కింద 444 రోజుల కాలపరిమితితో ఓ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని ఇదివరకే ప్రవేశపెట్టింది. ఈ రెండు ఎఫ్‌డీ పథకాలు ఆగస్టు 15 వరకు చెల్లుబాటులో ఉంటాయని ఐడీబీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి ➤ ‘ఎస్‌బీఐ యోనో’ను ఇక ఏ బ్యాంక్‌ కస్టమర్‌ అయినా వాడొచ్చు.. ఆ యూపీఐ యాప్‌లకు గట్టిపోటీ!

ప్రస్తుతం ఉన్న 444 రోజుల వ్యవధి ఎఫ్‌డీ పథకానికి సంబంధించి కాలబుల్‌ (మెచ్యూరిటీ కంటే ముందే విరమించుకోవడం) ఆప్షన్‌పై గరిష్టంగా 7.65 శాతం, నాన్-కాల్ ఎంపిక కింద గరిష్టంగా 7.75 శాతం వడ్డీ లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement