Canara Bank Hikes Fixed Deposit Rates: కెనరా బ్యాంక్ తన ఎఫ్‌డీ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు(౦.25) శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మార్చి 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయని కెనరా బ్యాంక్ తెలిపింది. కెనరా బ్యాంక్ 7 నుంచి 45 రోజుల మధ్య గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.90 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. వినియోగదారులకు 46 రోజుల నుంచి 90 రోజులు మధ్య గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.90 శాతం, 91 రోజుల నుంచి 179 రోజుల మధ్య గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.95 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు పేర్కొంది.
ఇంకా 180 రోజులు లేదా అంతకంటే తక్కువ మెచ్యూరిటీ వ్యవధి కలిగిన ఎఫ్‌డీలకు 4.40% వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే కస్టమర్లు 2-3 సంవత్సరాల కాల వ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. అలాగే కస్టమర్లు 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.25 శాతానికి బదులుగా.. 5.45 శాతం వడ్డీ రేటు లభించనుంది. మిగత ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల గురించి బ్యాంక్ పోర్టల్ సందర్శించండి. సీనియర్ సిటిజన్లు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడులపై అధిక వడ్డీ రేటును స్వీకరిస్తారని బ్యాంక్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు చేసే పెట్టుబడులపై బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5% అధిక వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంకు "1111 డేస్" రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకం కింద డిపాజిట్ రేటుకంటే అదనంగా 0.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ డిపాజిట్లపై అందించే వడ్డీ రేటు 5.55 శాతం.
(చదవండి: ఆ విషయంలో ఢిల్లీ, ముంబైలతో పోటీ పడుతున్న హైదరాబాద్!)
Comments
Please login to add a commentAdd a comment