బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇటీవల రూ. 3 కోట్లలోపు డిపాజిట్లపై ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సవరించిన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అందులో భాగంగా అధిక రాబడిని అందించే ‘స్టార్ ధన్ వృద్ధి’అనే పేరుతో కొత్త ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రవేశపెట్టింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చాయి. మార్పుల తర్వాత, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ రేట్లు సాధారణ ప్రజలకు రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి.
‘స్టార్ ధన్ వృద్ధి’ గురించి..
స్టార్ ధన్ వృద్ధి పథకం అనేది పరిమిత-సమయ ఎఫ్‌డీ స్కీమ్. ఇది 333 రోజుల స్థిర కాలవ్యవధికి 7.25 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే ఈ పథకం కింద మరింత మెరుగైన రాబడి లభిస్తుంది.
ఈ స్కీమ్ కింద సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు (వయస్సు 60-80 ఏళ్లు ) 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్లు ( వయస్సు 80 ఏళ్లకు పైబడి) 7.90 శాతం వడ్డీని బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment