ప్రముఖ ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. రూ. 3 కోట్ల లోపు వివిధ కాల వ్యవధుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు జూలై 24 నుంచి అమలులోకి వచ్చాయి. పెంపు తర్వాత, బ్యాంక్ ఎఫ్‌డీ గరిష్ట రేట్లు సాధారణ పౌరులకు 7.40%, సీనియర్ సిటిజన్‌లకు 7.90 శాతంగా ఉన్నాయి.
పెరిగిన ఎఫ్‌డీ రేట్లు ఇవే..
2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల కాలవ్యవధి డిపాజిట్‌పై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు అంటే 7.15% నుంచి 7.35% వరకు పెంచింది. అలాగే 4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల కాలవ్యవధిపై నా 20 బేసిస్ పాయింట్లు 7.20% నుంచి 7.40% కి పెంచింది.
రూ.3 కోట్ల లోపు డిపాజిట్‌లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వడ్డీ రేట్లు
టెన్యూర్ సాధారణ పౌరులకు సీనియర్ సిటిజన్లకు
7-14 రోజులు 3.00% 3.50%
15-29 రోజులు 3.00% 3.50%
30-45 రోజులు 3.50% 4.00%
46-60 రోజులు 4.50% 5.00%
61 - 89 రోజులు 4.50% 5.00%
90 రోజులు < = 6 నెలలు 4.50% 5.00%
6 నెలలు 1 రోజు < = 9 నెలలు 5.75% 6.25%
9 నెలల 1 రోజు నుంచి
< 1 సంవత్సరం వరకు 6.00% 6.50%
1 సంవత్సరం నుండి
<15 నెలల వరకు 6.60% 7.10%
15 నెలల నుండి
<18 నెలల వరకు 7.10% 7.60%
18 నెలల నుండి
<21 నెలల వరకు 7.25% 7.75%
21 నెలలు - 2 సంవత్సరాలు 7.00% 7.50%
2 సంవత్సరాల 1 రోజు నుండి
< 2 ఏళ్ల 11 నెలల వరకు 7.00% 7.50%
2 ఏళ్ల 11 నెలలు - 35 నెలలు 7.35% 7.85%
2 ఏళ్ల 11 నెలల 1 రోజు
< = 3 సంవత్సరాలు 7.00% 7.50%
3 ఏళ్ల 1 రోజు నుండి
< 4 ఏళ్ల 7 నెలల వరకు 7.00% 7.50%
4 ఏళ్ల 7 నెలలు - 55 నెలలు 7.40% 7.90%
4 ఏళ్ల 7 నెలలు 1 రోజు
< = 5 సంవత్సరాలు 7.00% 7.50%
5 ఏళ్ల 1 రోజు - 10 ఏళ్లు 7.00% 7.50%
Comments
Please login to add a commentAdd a comment