![Hdfc Bank Revises Interest Rates on Non-withdrawable Fds Check Rates Here - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/14/hdfc-bank.gif.webp?itok=_QnFTd1K)
ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల మాదిరిగా కాకుండా..ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విత్‌డ్రా చేయలేని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ రేట్లు దేశీయ కస్టమర్లకు, ఎన్‌ఆర్‌వో, ఎన్‌ఆర్‌ఈలకు వర్తిస్తాయి.కాగా రూ.5 కోట్ల కంటే ఎక్కువ లేదా సమానమైన విత్‌డ్రా చేయలేని ఎఫ్‌డీలకు మాత్రమే ఈ వడ్డీరేట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్త రేట్లు మార్చి 01, 2022 నుంచి అమలులోకి వచ్చాయని హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కొద్ది రోజుల క్రితం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు రూ. 2 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించాయి.
ఇక విత్‌డ్రా చేయలేని ఎఫ్‌డీలు సాధారణ డిపాజిట్‌ల కంటే భిన్నంగా ఉంటాయి. ఇవి ఎటువంటి అకాల ఉపసంహరణ సదుపాయాన్ని కలిగి లేని ఫిక్స్‌డ్ డిపాజిట్స్. అంటే గడువు ముగిసేలోపు డిపాజిటర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను మూసివేయలేరు. అసాధారణమైన పరిస్థితులలో ఈ డిపాజిట్‌లను అకాల ఉపసంహరణను బ్యాంక్ అనుమతిస్తోంది.
సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..!
► 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 5 కోట్ల నుంచి రూ.200 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై అత్యధిక ఎఫ్‌డీ వడ్డీరేటు 4.7 శాతం.
► 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.6 శాతం వడ్డీ రేటు.
► 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్‌డీలపై 4.55శాతం వడ్డీ రేటును పొందవచ్చు.
► 9 నెలల కంటే ఎక్కువ కాలం నుంచి ఒక ఏడాది కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్‌డీలపై 4.15 శాతం వడ్డీరేటు
► 6 నెలల నుంచి 9 నెలల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్‌డీలపై 4 శాతం వడ్డీరేటు ఇవ్వబడుతుంది.
► 91 రోజుల నుంచి 6 నెలల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్‌డీలపై అత్పల్ప వడ్డీ రేటు 3.75 శాతం.
చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!
Comments
Please login to add a commentAdd a comment