గత నెలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ ప్రముఖ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా మరోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు ఎంపిక చేయబడిన పీరియడ్‌పై మాత్రమే వర్తిస్తాయి. ఏప్రిల్ 6, 2022 నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి.
రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీరేట్లు వర్తించనున్నాయి. ఒక ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లను హెచ్‌డీఎఫ్‌సీ పెంచింది. దీంతో వడ్డీరేట్లు 5 శాతం నుంచి 5.10 శాతానికి పెరిగింది. రెండు సంవత్సరాల ఎఫ్‌డీలపై 5 శాతం నుంచి 5.10 శాతానికి 10 బేసిస్ పాయింట్లను పెంచుతూ హెచ్‌డీఎఫ్‌సీ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా....రూ. 5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటజన్లకు ఐదేళ్ల కాల వ్యవధిలో 25 బేసిస్ పాయింట్ల ప్రీమియంను బ్యాంక్ చెల్లిస్తూనే ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ సాధారణ 50 బేసిస్ పాయింట్ల ప్రీమియంతో అందిస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..!
చదవండి: ఒప్పో సంచలన నిర్ణయం..!
Comments
Please login to add a commentAdd a comment