
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ కాలపరిమితులపై డిపాజిట్ రేట్లను తగ్గించింది. 170 రోజుల వరకూ స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీరేటును 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. రిటైల్ సెగ్మెంట్‌లో దీర్ఘకాలిక కాలపరిమితి డిపాజిట్లపై రేట్లు 20 బేసిస్ పాయింట్లు, బల్క్ సెగ్మెంట్‌లో డిపాజిట్ రేట్లు 35 బేసిస్ పాయింట్లు తగ్గాయి. రూ. 2 లక్షలు ఆపైన బల్క్ డిపాజిట్లపై రేటును కూడా ఎస్‌బీఐ తగ్గించింది. తగ్గించిన తాజా రేట్లు ఆగస్టు 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment