SBI Amrit Kalash FD Scheme Deadline Extended Till 31-December-2023 - Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌: అత్యధిక వడ్డీ స్కీమ్‌ గడువు పొడిగింపు

Published Thu, Aug 17 2023 1:47 PM | Last Updated on Thu, Aug 17 2023 3:02 PM

Amrit Kalash SBI Fixed Deposit Scheme highest interest rate extended - Sakshi

Amrit Kalash Deposit Scheme Deadline Extended: కష్టపడి పోగుచేసుకున్న సొమ్మును భద్రపరచుకునేందుకు ఉత్తమమైన మార్గం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. అయితే వడ్డీ రేట్లు పొదుపుచేసే కాలానికి (టెన్యూర్‌) అనుగుణంగా ఉంటాయి. అలాగే సాధారణ ప్రజలు, మహిళలు, సీనియర్‌ సిటిజెన్‌లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వడ్డీ రేటుతో బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీములను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అత్యధిక వడ్డీని ఇచ్చే ‘అమృత్ కలశ్‌’ (Amrit Kalash) స్కీమును స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కొన్ని నెలల క్రితం ప్రకటించింది.

ప్రత్యేక పథకం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ప్రత్యేక అమృత్ కలశ్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీని మరోసారి పొడిగించింది. సాధారణ ప్రజలు, సీనియర్‌ సిటిజన్లకు అందించే అన్ని రకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల్లోనూ అత్యధిక వడ్డీని అందించే పథకం ఇదే. 

ఎస్‌బీఐ అమృత్ కలశ్‌ అనేది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్‌ స్కీమ్‌. ఈ పథకం 2023 ఏప్రిల్‌ 12 నుంచి అమలవుతోంది. ఈ స్కీమ్‌ కింద సీనియర్ సిటిజన్‌లకు 7.6 శాతం, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీని ఎస్‌బీఐ అందిస్తుంది. గత ఫిబ్రవరి 15న అధికారింగా లాంచ్‌ అయిన ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువును ఎస్‌బీఐ పలుసార్లు పెంచుతూ వచ్చింది. ఆగస్ట్‌ 15వ తేదీతోనే గడువు ముగిసినప్పటికీ తాజాగా మరోసారి డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి: శ్రావణమాస వేళ శుభవార్త: తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement