
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులు జమ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను సవరించింది. సీనియర్ సిటిజన్లు పెట్టుబడి పెట్టె ఎఫ్‌డీ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ రేటును అందించనున్నట్లు పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 2.9% - 5.25% మధ్య వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు (రూ.2 కోట్ల కంటే తక్కువ):
డిపాజిట్ కాల వ్యవది | వడ్డీ రేటు |
7 నుంచి 14 రోజులు | 2.9% |
15 నుంచి 29 రోజులు | 2.9% |
30 నుంచి 45 రోజులు | 2.9% |
46 నుంచి 90 రోజులు | 3.25% |
91 నుండి 179 రోజులు | 3.80% |
180 రోజుల నుంచి 270 రోజులు | 4.4% |
271 రోజులు నుండి 1 సంవత్సరం కంటే తక్కువ | 4.4% |
1 సంవత్సరం | 5% |
1 సంవత్సరం కంటే పైన & 2 సంవత్సరాల వరకు | 5% |
2 సంవత్సరాల కంటే పైన & 3 సంవత్సరాల వరకు | 5.10% |
3 సంవత్సరాలు పైన & 5 సంవత్సరాల వరకు | 5.25% |
5 సంవత్సరాల కంటే పైన & 10 సంవత్సరాల వరకు | 5.25% |
Comments
Please login to add a commentAdd a comment