ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ దారిలోనే హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కల్పిస్తూ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు మరింత వడ్డీరేట్ల పెంపు వుంటుందని బ్యాంకు తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఫిబ్రవరి 14 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది. కాగా ఈ వడ్డీరేట్ల పెంపు కేవలం రూ.2 కోట్లలోపున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వర్తించనునాయి. ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5 శాతానికి చేరింది. మూడేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5.45 శాతానికి చేరింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి
- 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం
- 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం
- 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
- 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
- 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
- 91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం
- 6 నెలలకు గాను 1 రోజుల నుంచి 9 నెలల టైం పీరియడ్ వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం
- 9 నెలల గాను 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ టైం పీరియడ్ వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం
- ఒక ఏడాది పాటు: జనరల్ పబ్లిక్ కోసం - 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.50 శాతం
- 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.70 శాతం
- 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం
- 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.35 శాతం
Comments
Please login to add a commentAdd a comment