ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను మరోసారి సవరించింది. కొద్ది రోజుల క్రితమే ఆయా టెన్యూర్స్‌కు సంబంధించి వడ్డీరేట్లను మార్చగా..ఇప్పుడు మరోకసారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేట్లను సవరిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీరేట్లు బుధవారం (ఏప్రిల్ 20) నుంచి అమల్లోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ వడ్డీరేట్లు వర్తించనున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో...“ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని పేర్కొంది. సవరించిన వడ్డీరేట్ల జాబితా ప్రకారం...హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ పౌరులకు 7-29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 2.5 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇక 30 నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 3.5 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.91 రోజులు- 6 నెలల వ్యవధిలో మెచ్యూర్ అయినట్లయితే, బ్యాంక్ సాధారణ పౌరులకు 3.5 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్‌లకు 4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై సాధారణ పౌరులకు 5.1 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్‌లకు 5.6 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. సాధారణ పౌరులకు 2 సంవత్సరాల వ్యవధితో 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల సమయం 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల సమయం 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు వరుసగా 5.2 శాతం, 5.45 శాతం, 5.6 శాతం. సీనియర్ సిటిజన్ల విషయంలో, ఈ రేట్లు వరుసగా 5.7 శాతం, 5.95 శాతం, 6.35 శాతంగా ఉన్నాయి.
చదవండి: మూకుమ్మడిగా షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment