
ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits) చేసే వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఎప్పటికప్పుడు స్పెషల్ స్కీమ్స్ తీసుకొస్తుంటుంది. ఎక్కువ వడ్డీ ఇస్తుండటంతో వీటిలో డిపాజిట్ చేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది.
ఆకర్షణీయ వడ్డీ అందించే స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ ఎస్‌బీఐలో రెండు ఉన్నాయి. అవి ఒకటి ‘అమృత్ కలశ్’ (SBI Amrit Kalash) కాగా మరొకటి ‘వుయ్‌కేర్’. అయితే వీటిలో ఎస్‌బీఐ వుయ్‌కేర్ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో నెలతో ముగుస్తుంది.
సీనియర్ సిటిజన్‌ల కోసం అధిక వడ్డీని అందించే ‘ఎస్‌బీఐ వుయ్‌కేర్’ (SBI Wecare) అనే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని 2022లో ప్రవేశపెట్టింది ఎస్‌బీఐ. రెన్యూవల్ అయ్యే మెచ్యూరింగ్ డిపాజిట్లతోపాటు కొత్త డిపాజిట్లకూ ఈ పథకం ప్రస్తుతం అందుబాటులో ఉంది.
పథకం ముఖ్యాంశాలు
- డిపాజిట్ వ్యవధి: కనిష్టంగా 5 సంవత్సరాలు, గరిష్టంగా 10 సంవత్సరాలు.
- అర్హత: 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లు మాత్రమే అర్హులు.
- వడ్డీ రేటు: 7.50 శాతం.
ఇదీ చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: వడ్డీ రేట్లు మారాయ్..