ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: భారత బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొన్ని స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను అరశాతం వరకూ తగ్గించింది. బ్యాంక్ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. దీనిప్రకారం 179 రోజుల వరకూ డిపాజిట్లపై వడ్డీరేటు అరశాతం తగ్గింది. 7-179 రోజుల మధ్య డిపాజిట్లపై వడ్డీరేటు అరశాతం తగ్గి 7.5% నుంచి 7%కి చేరింది.
కొత్త రేటు ఈ నెల 18వ తేదీ నుం చీ అమల్లోకి వస్తుంది. ఇక రూ.కోటి రూపాయలకు పైబడిన డిపాజిట్ రేట్లకు సంబంధించి రెండు మెచ్యూరిటీల విషయంలో వడ్డీరేటు తగ్గింది. 7-60 రోజుల మధ్య రేటు పావుశాతం తగ్గింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి దిగింది. 61 రోజుల నుంచి యేడాది వరకూ రేటు ప్రస్తుత 7 శాతం నుంచి 6.75 శాతం తగ్గింది.