SBI Special Platinum Fixed Deposit Scheme Ends on Sept 14 - Sakshi
Sakshi News home page

అదిరిపోయే ఎస్‌బీఐ ఆఫర్ వారం రోజులు మాత్రమే

Published Tue, Sep 7 2021 3:54 PM | Last Updated on Tue, Sep 7 2021 8:26 PM

SBI Special Platinum Fixed Deposit Scheme Ends on Sept 14 - Sakshi

దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారుల కోసం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్‌’ కింద కస్టమర్లు 75 రోజులు, 75 వారాలు, 75 నెల‌ల వరకు డిపాజిట్ చేసే మొత్తంపై 15 బేసిస్ పాయింట్లు వరకు అద‌నంగా వ‌డ్డీ ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చు. ఈ ఆఫర్ 2021 సెప్టెంబ‌రు 14 వ‌ర‌కు మాత్రమే అమ‌ల్లో ఉంటుంది. 

7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య సాధారణ ఖాతాదారులు పొదుపు చేసే ఎఫ్‌డీలపై 3.9% నుంచి 5.4% వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్లు జమ చేసే డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) అదనంగా లభిస్తాయి. ఈ వడ్డీ రేట్లు 8 జనవరి 2021 నుండి అమల్లోకి రానున్నాయి. (చదవండి: Tesla: భారత్‌లో ఆన్‌లైన్‌ ద్వారా కార్ల అమ్మకం!)

అర్హత:

  • ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ టర్మ్ డిపాజిట్లతో సహా దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు(₹2 కోట్ల కంటే తక్కువ)
  • కొత్త, రెన్యువల్ డిపాజిట్లు
  • టర్మ్ డిపాజిట్, స్పెషల్ టర్మ్ డిపాజిట్ ప్రొడక్ట్లు మాత్రమే.
  • ఎన్ఆర్ఈ డిపాజిట్లు(525 రోజులు, 2250 రోజులు మాత్రమే)

సాధారణ ప్రజలకు ఎస్‌బీఐ ప్లాటినం వడ్డీ రేట్లు

 Tenor  Existing Interest Rate  Proposed Interest Rate 
 75 రోజులు  3.90%   3.95%
 525 రోజులు  5.00%  5.10%
 2250 రోజులు  5.40%  5.55%

సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ ప్లాటినం వడ్డీ రేట్లు

Tenor:  Existing Interest Rate  Proposed Interest Rate
 75 రోజులు  4.40%  4.45%
 525 రోజులు  5.50%  5.60%
 2250 రోజులు  6.20%   6.20%

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement