ఢిల్లీ: ఇండియన్ మెడికల్ అసోషియేషన్(IMA) అధ్యక్షుడు డా. ఆర్‌వీ అశోకన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తప్పు పట్టింది. భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో తాము అందిరికంటే ముందు ఉంటామని మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.
పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యవహరిస్తున్న తీరుపై ఓ ఇంటర్వ్యూలో అశోకన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అమానుల్లా బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే పతంజలి నకిలీ ప్రకటనల కేసులో అశోకన్ పిటిషన్‌గా ఉన్నారని గుర్తుచేసింది.
‘మీ (అశోకన్) నుంచి మరింత బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు ఆశించాం.కోర్టు తీర్పుకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలా హఠాత్తుగా మారటానికి కారణం ఏంటీ?’అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ విషయంలో సుప్రీం కోర్టుకు అశోకన్ క్షమాపణలు తెలియజేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలపై మీ క్షమాపణలను ఒకవేళ కోర్టు అంగీకరిస్తే.. మిమ్మల్ని కించపరిచారని కోర్టు ఆశ్రయించారు. అలాంటప్పుడు మీకు ఎలాంటి పరీక్ష పెట్టాలి?’ అని కోర్టు నిలదీసింది. క్షమాపణల అఫిడవిట్‌పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బహిరంగంగా ఎందుకు క్షమాపణలు చెప్పలేదని ప్రశ్నించింది. ‘మీరు నిజంగా క్షమాపణలు చెప్పాలనుకుంటే మీ అఫిడవిట్‌ను ఎందుకు సరిదిద్దుకోలేదు? ఇంటర్వ్యూ అనంతరం మిమ్మల్ని మీరు ఏవింధంగా సరిదిద్దుకున్నారో చెప్పండి’అని ధర్మాసనం ప్రశ్నించింది.
‘భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో మేము ముందుంటాము. కానీ స్వీయ నియంత్రణ ఉండాల్సిన సందర్భాలు ఉంటాయి. మీకు నియంత్రణ ఉన్నట్లు ఆ ఇంట ఇంటర్వ్యూలో మాకు కనిపించలేదు’అని జస్టిస్ హిమకోహ్లి అన్నారు. ‘న్యాయమూర్తులుగా మేము విమర్శలు ఎదుర్కొంటున్నా. మేము స్పందించము. ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా అహం ఉండదు. మేము ఉన్నతస్థానంలో ఉన్నాం. మేము చర్యలు తీసుకోవడానికి అర్హులం. చాలా అరుదుగా మాత్రమే చర్యలు తీసుకుంటాం’అని జస్టిస్ అమానుల్లా అన్నారు.
‘మీరు ఇలాంటి వ్యాఖ్యలతో కోర్టు గురించి ఏమి చెప్పలేరు. ఇలాంటి వ్యాఖ్యలే మీపైనే చేస్తే ఏం చేసేవారు’అని కోర్టు ప్రశ్నించింది. అశోకన్ సమర్పించిన అఫిడవిట్‌ను చాలా చిన్న, ఆలస్యంతో కూడినదిగా కోర్టు పేర్కొంది.
ఈ విషయంలో ఉరట కల్పించాలని అశోకన్ తరుఫు న్యాయవాది కోరగా జస్టిస్ కోహ్లి స్పందింస్తూ. మీరు ప్రతిదీ చెప్పడానికి లేదు. అశోకన్ ట్రాప్‌లో చిక్కుకున్నారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఈ కేసుపై విచారణను సుప్రీం కోర్టు జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. ఇక.. పతంజలి నకిలీ ప్రకటనల కేసు విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణ ఇప్పటికే రెండుసార్లు క్షమాపణలు తెలిపినా కోర్టు తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment