న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం వృద్ధితో రూ. 269 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 234 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాంత ఎగసి రూ. 7,964 కోట్లకు చేరింది.
గతంలో రుచీ సోయా ఇండస్ట్రీస్‌గా కార్యకలాపాలు సాగించిన కంపెనీ గత క్యూ3లో రూ. 6,301 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) నికర లాభం రూ. 572 కోట్ల నుంచి రూ. 623 కోట్లకు బలపడింది. మొత్తం ఆదాయం రూ. 17,608 కోట్ల నుంచి రూ. 23,858 కోట్లకు జంప్‌చేసింది.
చదవండి: రికార్డు స్థాయిలో సేల్స్.. ఎగబడుతున్న జనం, ఆ ఇళ్లకి యమడిమాండ్!
Comments
Please login to add a commentAdd a comment