వాట్సాప్ గట్టి పోటీగా పతంజలి కింభో యాప్
న్యూఢిల్లీ : వాట్సాప్ గట్టి పోటీగా.. స్వదేశీ మంత్రాన్ని జపిస్తూ... పతంజలి తీసుకొచ్చిన మెసేజింగ్ యాప్ కింభో. ఆ యాప్ మార్కెట్‌లో ఆవిష్కరణ అయిన 24 గంటల్లోనే తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. దీంతో ఒక్కసారిగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ ఈ యాప్‌ను తొలగించేశారు. కింభో యాప్ చాలా ప్రమాదకరమంటూ ఫ్రెంచ్ నిపుణులుచెప్పేసరికి పతంజలి సైతం తమ యాప్‌లో ఉన్న సమస్యలన్నింటిన్నీ తొలగించాక రీ-లాంచ్ చేస్తామని ప్రకటన చేసింది. తాజాగా ఆ యాప్‌కు మరిన్ని టెస్ట్‌లు చేస్తోంది. ఈ యాప్‌ను బయటికి విడుదల చేయడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశముందని యోగా గురు బాబా రాందేవ్ ప్రకటించారు.
‘టెస్టింగ్ దశలోనే ఈ యాప్ భారీ ఎత్తున్న ట్రాఫిక్‌ను ఎదుర్కొంది. ఇది కేవలం పైలెట్ దశ మాత్రమే. ప్రస్తుతం ప్రిపరేషన్స్‌లు జరుగుతున్నాయి. ఈ యాప్ సెట్ కావడానికి మరో రెండు నెలల పట్టే అవకాశముంటుంది. పెద్ద ఎత్తున్న యూజర్ ట్రాఫిక్‌ను ఎలా నిర్వహించాలో ప్రస్తుతం మేము పరిశీలిస్తున్నాం’ అని శుక్రవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాబా రాందేవ్ పేర్కొన్నారు. ‘స్వదేశీ మెసేజింగ్ యాప్’ను భవిష్యత్తులో అధికారికంగా లాంచ్ చేస్తామని చెప్పారు. మార్కెట్‌లో ఉన్న ప్రస్తుత మెసేజింగ్ యాప్స్‌కు గట్టి పోటీగా పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ యాప్‌ను తయారుచేసినట్టు మే నెలలో కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. సిమ్ కార్డును విడుదల చేసిన అనంతరం, ‘ ఇప్పుడు భారత్ మాట్లాడుతుంది’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ యాప్‌ను తీసుకొచ్చింది. కానీ ఆ యాప్‌లో ప్రైవసీ సమస్యలున్నాయనే కారణంతో గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ నుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment